ఈ మద్య పార్లమెంట్ లో జరిగిన సంఘటన చూసి భారతీయులే కాదు..యావత్ ప్రపంచం సైతం ఆశ్చర్యపోయింది.  ఉప్పు-నిప్పుగా ఉండే ప్రధాని నరేంద్ర మోడీ-కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహూల్ గాంధి మద్య జరిగిన సంఘటన చూసి ఔరా అనుకున్నారు.  రాహూల్ తన ప్రసంగం తర్వాత ఉన్నట్టుండి మోదీ వద్దకు వెళ్లారు..ఆయను ఆలింగనం చేసుకున్నారు. దాంతో ఒక్కసారే మోడీ ఆశ్చర్యపోయారు..ఆ తర్వాత హిందువుల..భారతీయుల ప్రేమాభిమానాలు ఇలాగే ఉంటాయని కామెంట్ చేశాడు రాహూల్. 
Image result for rahul gandhi hug modi
ఆ తర్వాత రాహూల్ కన్నుకొట్టడం కూడా పెను సంచలనం అయ్యింది.  ఇదిలా ఉంటే ఇప్పుడు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ  చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వేళ, విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు స్మృతీ ఇరానీ విజిల్ వేశారు..ఆ సమయంలో అందరూ ఆశ్చర్యపోయినా..ఆమెతో పాటు విజిల్ వేస్తూ సంతోషాన్ని వ్యక్త పరిచారు.  అయితే ఇదే ఇప్పుడు పెద్ద వివాదం అయ్యింది. మంత్రి స్మృతీ ఇరానీ ఈల వేశారని, తద్వారా ఆమె పార్లమెంట్ ను అవమానించారని సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది.
Image result for smriti irani
గత నెలలో లోక్ సభ ముందుకు వచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ తన ప్రసంగం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం, ఆపై తన స్థానంలో కూర్చుని కన్ను కొట్టిన దృశ్యాలను బీజేపీ వైరల్ చేస్తుండగా, దీనికి ప్రతిగా, స్మృతీ ఇరానీ ఈల వేస్తున్న దృశ్యాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. నసీమ్ అహ్మద్ అనే వ్యక్తి ఈ ఫొటోను తొలుత షేర్ చేశాడు. ఇక ఈ ఫొటోను గూగుల్ లో వెతుకగా, అది గత సంవత్సరం అక్టోబర్ దని, ఆమె ఈల వేసింది పార్లమెంట్ లో కాదని తెలుస్తోంది.  ఇక బీజేపీ మద్దతుదారులు ఇదే విషయాన్ని తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పంచుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: