ఈ మద్య చాలా మంది డబ్బు సంపాదించడానికి అక్రమ మార్గాలు ఎన్నుకుంటున్నారు.  ముఖ్యంగా డ్రగ్స్ దందా..సెక్స్ రాకెట్ లతో ఈజి మనీ సంపాదిస్తున్నారు.  వీరి టార్గెట్ అమయకులైన యువతీ యువకులే..అందుకే కొంత మందికి డబ్బు ఆశ చూపించి యువకులను డ్రగ్స్ కి..యువతులను వ్యభిచార వృత్తికి డైవర్ట్ చేస్తున్నారు.  తాజాగా ఉద్యోగాల పేరుతో యువతులను నమ్మించి తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ ముఠా ఆటలను పోలీసులు కట్టించారు. వారి చెర నుంచి 18 మంది యువతులను రక్షించారు.  అయితే వీరిలో దాదాపు పదహారు మంది నెపాలీ యువతులు కావడం విశేషం. 

ఢిల్లీలోని వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో వారణాసి క్రైం బ్రాంచ్, ఢిల్లీ పోలీసులు కలిపి నిర్వహించిన దాడుల్లో ఈ విషయం వెలుగు చూసింది.  పక్క సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిపై దాడి చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నేపాలీ మహిళలను ఉద్యోగాల పేరుతో తొలుత వారణాసి తీసుకొచ్చేవారని పోలీసులు తెలిపారు. 
Image result for india sex racket
వీరు యువతులను గల్ఫ్ దేశాలకు పంపించేందుకు సర్వం సిద్దం చేసుకున్నారు.  ఈ నెల మొదటి వారంలో ముఠా చెర నుంచి ఇద్దరు నేపాలీ యువతులు తప్పించుకున్నట్టు చెప్పారు. ఈ రాకెట్ గురించి నేపాలీ పోలీసులకు సమాచారం అందించామని, వారు రాయబార కార్యాలయానికి ఈ విషయాన్ని చేరవేసినట్టు పోలీసులు వివరించారు.  నిందితుల్లో ఒకడైన జై సింగ్‌ను విచారించగా యువతులను మధ్యప్రాచ్యానికి పంపాలని నిర్ణయించినట్టు చెప్పాడని తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: