వైసీపీ  అధినేత జగన్ పాదయాత్ర  విశాఖ జిల్లాలో ఈ నెల 12 నుంచి మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ రెడీ అయిపోయింది దాదాపు ఇరవై రోజులకు పైగా జగన్ విశాఖ  జిల్లాలో పాదయాత్ర చేయబోతున్నారు. దీంతో వైసీపీ శ్రేణులలో కొత్త జోష్ వచ్చెసింది.


టీడీపీ కంచుకోటలే టార్గెట్ :


జగన్ రూట్ మ్యాప్ చూస్తే టీడీపీ బలంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలే టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు సీటు అయిన నర్శీపట్నం నుంచి పాదయాత్రతో జగన్ విశాఖ జిల్లాలో అడుగు పెడతారు ఆక్కడ నుంచి పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, చోడవరం, పెందుర్తి మీదుగా సాగి విశాఖ సిటీలోకి ఎంటర్ అవుతారు.


సిటీనీ చుట్టేయనున్న జగన్ :


మొదట్లో విశాఖ సిటీ లేకపోయినా మారిన షెడ్యూల్ ప్రకారం విశాఖ సిటీలో ఉన్న ఏడు అసెంబ్లీ ప్రాంతాలలో కూడా జగన్ పాదయాత్ర సాగబోతోంది. మొత్తం సిటీ పాదయాత్ర అయ్యాక విశాఖ బీచ్ లో భారీ సభ నిర్వహిస్తారు. 


ఏర్పాట్లు రెడీ :


జగన్ పాదయాత్ర నేపధ్యంలో చక చకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎన్నికలు హడావుడి మొదలు కావడంతో జగన్ పాదయాత్ర తమ నియోజక వర్గంలో ఉండాలని నాయకులు చేసిన విన్నపాలు మొత్తంగా ఫలించాయి. 15 అసెంబ్లీ సీట్లో ఏజెన్సీ తప్ప అన్నింటినీ జగన్ కవర్ చేసేలా రూట్ మ్యాప్ తయారైపోయింది.  దాంతో పార్టీ నాయకులు హ్యాపీగా ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: