పాపం, పవన్ కళ్యాణ్..రాజకీయమంటే ఏంటో మెల్లగా తెలుసుకుంటున్నాడు. ఆ మధ్యన తన టూర్లో భాగంగా అనకాపల్లి వెళ్ళి పనిలో పని కాదు అసలు పనే అది అనుకుంటూ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇంటికి కోరి  మరీ వెళ్ళాడు. ఆ రోజు దాడి బర్త్ డే. దాంతో ఆయనకు విషెస్ చెబుతూనే పార్టీలోకి రావాలంటూ కోరాడు. చూద్దామని చెప్పిన మాజీ మంత్రి గారు నెలలు గడచినా చూస్తూనే ఉన్నారు. ఉన్నట్లుండి ఇపుడు సైకిల్ ఎక్కాలని ఉంబలాటపడుతున్నట్లు టాక్. దాంతో పవన్ కి పవన్ కి గట్టి షాకే తగిలింది. రాజకీయం రంగు ఏంటో తొలి రుచి చూపించిందంటున్నారు.


కళాతో మంతనాలు :


ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట రావుతో దాడి ఈ మేరకు మంతనాలు స్టార్ట్ చేశారు. తనకు ఉన్న సాన్నిహిత్యంతో కళాను సంప్రదించిన దాడి అవకాశం ఇస్తే పార్టీలోకి వచ్చేస్తానంటూ డైరెక్ట్ గా బాబుకు రాయబారాలు పంపుతున్నారు.


ఓకే  అంటున్న బాబు :


ఎన్నికల వేళ ఎవరొచ్చినా తలుపులు తెరచే ఉన్నవని చెబుతున్న చంద్రబాబు దాడికి వెల్ కం చెప్తారని తెలుస్తోంది. విశాఖ జిల్లాలో సీనియర్ లీడర్ గా ఉన్న దాడి ఆరేళ్ళ క్రితం టీడీపీని వీడారు. తనకు రెండవమారు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేదని అలిగి వైసీపీలో చేరారు. జగన్ 2014లో ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చినా ఓడిపోయాడు. దాంతో దాడి అక్కడ నుంచి తప్పుకుని చాలాకాలంగా రాజకీయ వనవాసం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: