మరో వారంలో జగన్ ఉత్తరాంధ్ర పాదయాత్ర మొదలుకాబోతోంది. ఇప్పటికి పది జిల్లాలలో వేలాది కిలోమీటర్లతో సాగిన జగన్ పాదయాత్ర ఉత్తరాంధ్ర ముంగిట అడుగు పెట్టబోతోంది. ఈ నెల 12 నుంచి జగన్ విశాఖ జిల్లాలో అడుగు పెడుతున్నారు. అన్ని జిల్లాలలో పాదయాత్ర సూపర్ సక్సెస్ గా సాగుతూండడంతో టీడీపీ వణికిపోతోంది. ఆ పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్రలో కూడా ఊపేయడం ఖాయమని తెలుసుకున్న పసుపు పార్టీ వీలైనంత మేర కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తోంది.


బొట్టు పెట్టి మరీ :


జగన్ పాదయాత్రలో అనేకమని టీడీపీ నాయకులు, మాజీలు చేరుతారని పక్క సమాచారం ఉండడంతో ఉలిక్కిపడిన బాబు కొత్త ప్లాన్ రెడీ చేశారు. ఇంతకాలం టీడీపీలో చేరేందుకు ట్రై చేసి విసిగి వేసారిన అనకాపల్లి మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలాగే మాజీ ఎంపీ సబ్బం హరిని సైతం తొందరలోనే పార్టీలోకి రప్పించే పని షురూ చేశారు.


బుజ్జగింపులకు సై :


టీడీపీలో అలకలు, అసమ్మతితో ఉన్న వారిని గుర్తించి మరీ బుజ్జగింపు కార్యక్రమానికి బాబు శ్రీకారం చుట్టేశారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టిని పిలిచి మరీ పార్టీలో ఉండమంటూ వేడుకున్నారు. పార్టీలు మారితే చెడ్డ పేరు వస్తుందని హిత బోధ కూడా చేశారని టాక్. విశాఖ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే వైసీపీ వైపు చూస్తున్నాడని తెలిసి పిలిపించుకుని మరీ నచ్చచెప్పారట. 


అందరికీ ఇదే ఆహ్వానం :


పార్టీలో వీలనంత మందిని  చేర్పించాలని బాబు నాయకులకు ఆదేశాలు జారీ చేశారని టాక్. పనిలో పనిగా మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణని కూడా టీడీపీలోని తెచ్చేందుకు బాబు గట్టిగా  ప్రయత్నిస్తున్నట్లు భోగట్టా. విజయనగరం జిల్లాలో కూడా ఇద్దరు నాయకులు టీడీపీ నుంచి వైసీపీ వైపు వెళ్తారని తెలియడంతో వారికీ క్లాస్ తీసుకున్నారట. స్రీకాకుళం జిల్లాలోనూ అసమ్మతి నాయకులతో మాట్లాడే పనిని సీనియర్లకు అప్పగిచారని టాక్.


గుర్రుమీదున్న తమ్ముళ్ళు :


జగన్ మానియాతో వణికిపోతున్న అధినాయకుడు ఇలా అందరినీ పార్టీలోకి తీసేసుకుని ఉన్న వారికి అన్యాయం చేస్తున్నారని తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారట. సబ్బం హరి వంటి వారికి బంపర్ ఆఫర్లు ప్రకటించి పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టడమేంటని ఫైర్ అవుతున్నారు. పార్టీలో దమ్మున్న నాయకులే లేనట్లుగా బయట వారిని తీసుకురావడం వల్ల బలం పెరగక పోగా అసలుకే ఎసరు వస్తుందని పెద్ద తలకాయలు మొత్తుకుంటున్నాయి.

బాబు చేస్తున్న ఈ పనితో మొత్తం బూమరాంగ్ అవుతుందని వార్నింగులు ఇస్తున్నారు. టోటల్ గా చూసుకుంటే జగన్ రాకముందే టీడీపీ తీరు ఇలా ఉంటే తీరా పాదయాత్ర మొదలయ్యాక సైకిల్ కి ఎన్ని పంచర్లు పడతోయోనని సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: