ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ప్రజారం జోరు పెంచారు.  ప్రస్తుతం టీడీపీ, వైసీపీలను టార్గెట్ చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.  ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ విమర్శలు ఎక్కుపెట్టారు. హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో ఆ పార్టీకి సంబంధించిన వీర మహిళ విభాగం సమావేశాన్ని నిర్వహించారు.  తనను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శించినా, తిట్టినా పట్టించుకోనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు.


హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో ఆ పార్టీ సంబంధించిన వీర మహిళ విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ మాట్లాడుతూ..       ‘స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలిచే సంస్కృతి మనది. అలాంటి మన దేశంలోనే ఆడపడుచులకు కనీస భద్రత కల్పించలేకపోతున్నారు. స్త్రీ అర్థరాత్రి ఒంటరిగా వెళ్లగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ గారు అన్నారు. ఇప్పుడు పట్టపగలు కూడా స్త్రీలు ధైర్యంగా వెళ్లలేని పరిస్థితి ఉంది.

Related image

మహిళలకు కనీస భద్రత కల్పించడం అవసరం అన్నారు. చంద్రబాబు పరిపాలనలో మహిళలకు రక్షణ ఉందా అని ప్రశ్నించారు.  విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదు.   అదే సింగపూర్ తరహా పాలన అయితే ఆ ఎమ్మెల్యే జైల్లో ఉంటాడు. ఈ మద్య నాపై వైసీపీ నేత జగన్ ఎవేవో మాట్లాడారని..అది ఆయన వ్యక్తిత్వానికే వదిలేశానని అన్నారు.   నాకు వారి ఇంట్లోని ఆడపడుచులు, తల్లి, బిడ్డలు గుర్తుకొస్తారు. నేను జగన్ గారిని వ్యక్తిగతంగా అంటే వారి ఇంట్లోవారు ఎంత బాధపడతారో గ్రహించగలను.

Image result for jagan

ఓ అమ్మాయి నన్ను తిట్టినా నేను అలాగే ఆలోచించాను. మా అమ్మగారు, అక్కాచెల్లెళ్లు, వదిన... వీరందరి మధ్య పెరిగినవాణ్ణి. నాకు చదువు ఇబ్బందిగా మారి, మనసుకు ఎక్కని పరిస్థితుల్లో వదిన గారు ఇచ్చిన ధైర్యం మరిచిపోలేనిది. ఒకానొక పరిస్థితిలో నేనే డిప్రెషన్ లో ఉన్న సమయంలో మా వదినమ్మే నాకు మనోధైర్యాన్ని నింపి నేను ఈ స్థాయికి వచ్చేలా చేసిందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: