జగన్ కాపుల మీద చేసిన వ్యాఖ్యలను టీడీపీ అండ్ అనుకూల మీడియా ఏ విధముగా వాడుకోవాలని ప్లాన్ చేసిందో తెలిసిందే. జగన్ ఒకటి మాట్లాడితే మరొకటి ప్రచారం చేసింది. ఎందుకంటే కాపుల ఓట్లు చాలా రాజకీయ పార్టీలకు చాలా ముఖ్యం కాబట్టి. ఇప్పడూ కూడా ఇదే ప్లాన్ ను పవన్ మీద అమలు చేయాలను ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఈ నేప‌థ్యంలో గ‌తంలో ఒకస‌భ‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా కాపుల రిజ‌ర్వేష‌న్లపై వెల్లడించిన అభిప్రాయం ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చింది.

Image result for pavan kalyan jansena

కాపుల రిజ‌ర్వేష‌న్లు సాధ్యంకావ‌నే రీతిలో ఆయ‌న కూడా అభిప్రాయ‌ప‌డిన‌ట్టు టీడీపీ సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. తద్వారా కాపుల ఓట్లు గంప‌గుత్తగా జ‌న‌సేన‌కు ప‌డ‌కుండా త‌మవైపు మ‌ళ్లించేందుకు టీడీపీ ఎత్తుగ‌డ వేసిన‌ట్టు జ‌న‌సేన అంచ‌నాకు వ‌చ్చింది. గ‌తంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ కాపుల రిజ‌ర్వేష‌న్ సాధ్యప‌డేదా, లేదా అని మీరు ఆలోచించాలా వ‌ద్దా?,  ప‌్రజ‌ల‌ను మ‌భ్యపెట్టి రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని చెప్పి ఈ రోజు ఏం చేశారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.

Image result for pavan kalyan jansena

ప్రస్తుతం ఈ ప్రసంగ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతోంది. త‌మనేత జ‌గ‌న్ అన‌ని విష‌యాన్ని అన్నట్టు ఎల్లో మీడియా, టీడీపీ నేత‌లు ప్రచారం చేస్తున్నార‌ని, మ‌రి ప‌వ‌న్ మాట‌ల‌కు అర్థమేమిటో చెప్పాల‌ని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.ఈ నేప‌థ్యంలో  తూర్పుగోదావరి జిల్లా  కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం స్వగృహంలో బుధవారం తూర్పు, పశ్చిమ, విశాఖజిల్లాల కాపు జేఏసీల సంఘం నేత‌ల స‌మావేశం ప్రాధాన్యం సంత‌రించుకొంది. మీడియాకు అనుమ‌తిలేని ఈ స‌మావేశంలో జ‌గ‌న్‌తో పాటు ప‌వ‌న్ ప్రసంగంపై కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలిసింది. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలో సామాజిక‌వ‌ర్గ యువ‌త వెంట ఉండ‌టంతో వ్యతిరేకంగా వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌నే నిర్ణయానికి వ‌చ్చార‌ని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: