చంద్ర బాబు నాయుడు ఏ సభలో నైనా మైకు తీసుకున్న ఎప్పడూ ఒకే మాట చెబుతుంటాడు అదే ఈ దేశం లో అందరీ కన్నా నేనే సినియర్ లీడర్ అని నరేంద్ర మోడీ రాజకీయాల్లో నాకంటే జూనియర్ అని పలుమార్లు ప్రస్తావించిన సంగతీ తెలిసిందే. అయితే బాబు ఇప్పటికే ఇదే కామెడీ ని అన్ని సభలలో ప్రదర్శిస్తున్నాడు. చంద్రబాబుకి రాజకీయాల్లో 40 ఏళ్ళకు పైగా అనుభవం వుంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అలాంటి చంద్రబాబుని 'రాజకీయాల్లో సీనియర్‌..' అంటూ ఇతరులు గుర్తించాలి. 

Image result for chandrababu naidu

2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతోపాటు జనసేనతోనూ పొత్తుపెట్టుకోకపోయి వుంటే, ఆ పార్టీ పరిస్థితి ఇప్పుడెలా వుండేదో ఊహించుకోవడమే కష్టం. జనసేన, బీజేపీతో కలిస్తేనే.. అతి తక్కువ ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గట్టెక్కింది. దేశంలో నరేంద్రమోడీ హవా కావొచ్చు, కాపు సామాజిక వర్గం పవన్‌కళ్యాణ్‌ కారణంగా టీడీపీ వైపు మొగ్గుచూపడం కావొచ్చు.. ఎలాగైతేనేం, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్‌కి.

Image result for chandrababu naidu

ఏదో అదృష్టం కలిసొచ్చి ప్రధాని అయ్యారంటూ నరేంద్రమోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు నారా చంద్రబాబునాయుడు. నరేంద్రమోడీ అదృష్టం కలిసొచ్చి ప్రధాని అయ్యారా.? లేదా.? అన్న విషయం పక్కనపెడితే, చంద్రబాబుకి మాత్రం అదృష్టం కలిసొచ్చే ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయ్యారన్నది నిర్వివాదాంశం. ఆయనకన్నా అదృష్టవంతుడు ఆయనగారి పుత్రరత్నం నారాలోకేష్‌. ముఖ్యమంత్రి అయ్యాక తొలి ఏడాదిలోనే కేంద్రం తీరుని ఎండగట్టి వుంటే, చంద్రబాబు మాటలకు విశ్వసనీయత కాస్తయినా వుండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: