ఈ మద్య ఒక సినిమా చూడాలంటే సామాన్యుడికి తలకు మించిన భారం అవుతుంది.  ఎన్నో టెన్షన్స్ తో ఉన్నవారు కాస్త సేద తీరాలని ఎంట్ర టైన్ మెంట్ కి ప్రాధాన్యత ఇస్తారు.  తన కుటుంబ సభ్యులతో సినిమాలకు వెళ్తారు..కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబంతో సినిమాకు వెళ్లాంటే..కనీసం రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది..ఇది సామాన్య పౌరుడు భరించడం కష్టం. అయితే థియేటర్లో టిక్కెట్ కన్నా తిండి పదార్థలు, డ్రింక్స్ పై అధికంగా డబ్బులు లాగుతున్నారు థియేటర్ల యాజమాన్యం.  అయితే వీటన్నింటిక చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం అధిక ధరలకు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. 

Image result for indian multiplex teheaters

కానీ ఇప్పటికీ అదే దోపిడీ... అదే లూటీ... ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ ధరకు తినుబండారాలు, కూల్ డ్రింక్స్ అమ్మకూడదన్న ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ యథావిధిగా దోచుకుంటున్నాయి పలు మల్టీప్లెక్సులు, బడా థియేటర్లు. ఆగష్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలను బేఖాతరు చేశాయి ఆయా థియేటర్ యాజమాన్యాలు.    పెద్ద థియేటర్లలో ఎక్కడా నిబంధనలు అమలు కావడం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పలు టీవీ చానళ్లు నిన్న మాల్స్ పై నిఘా పెట్టి, రహస్య కెమెరాలతో వెళ్లి మాల్స్ లో జరుగుతున్న అధిక ధరల దందాను వీడియో తీసి మరీ తమ తమ చానళ్లలో చూపుతున్నాయి.

Image result for indian multiplex teheaters cantens

థియేటర్లలో ప్రతి ఉత్పత్తి ధరా బయటి రేటుతో పోలిస్తే మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. 20 రూపాయల విలువైన కూల్ డ్రింక్ ధరను 120 నుంచి 130 రూపాయల వరకూ పెంచి అమ్ముతున్నారని తెలుస్తోంది.  హైదరాబాద్ లో ప్రముఖ మాల్స్ అయిన పీవీఆర్, ఐనాక్స్, సినీ మ్యాక్స్ లో టీవీ 9, ఏబీఎన్, ఎన్ టీవీ తదితర తెలుగు వార్తా చానళ్లు స్టింగ్ ఆపరేషన్ చేశాయి. పీవీఆర్ సెంట్రల్ లో పాప్ కార్న్ ప్యాకెట్ ను రూ. 125కు విక్రయించారు. 650 ఎంఎల్ కూల్ డ్రింక్ పై రూ. 180 వరకూ వసూలు చేశారు.


కాంబోల పేరిట రూ. 300 వరకూ దోచుకున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రం పరిస్థితి కొంత మారిందని, ఎంఆర్పీ ధరలకే వాటర్, కూల్ డ్రింక్స్, తినుబండారాలు లభిస్తున్నాయని ప్రేక్షకులు వ్యాఖ్యానించడం గమనార్హం.కాగా, మల్టీ ప్లెక్సుల్లో అధిక ధరలపై ఫిర్యాదు చేయాలంటే టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్స్ యాప్ నంబరు 7330774444ను సంప్రదించాలని తూనికలు, కొలతల శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: