ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కి షాక్ ఇవ్వబోతున్నాడు ప్రధాని మోడీ. ప్రత్యేకహోదా అంశంలో భారతీయ జనతా పార్టీని మోడీని రాష్ట్రంలో దోషిగా చిత్రీకరించిన చంద్రబాబు కి మోడీ సరైన రీతిలో సంచలనమైన షాక్ ఇస్తున్నట్లు టాక్. 2014 ఎన్నికలలో బీజేపీతో జతకట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..అధికారమే పరమావధిగా భావించి విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని తన అవినీతి కార్యక్రమాలతో మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టారు.
Image result for chandrababu paritala sri ram meeting at ananthapuram
ఈ క్రమంలో కేంద్రం నుండి వచ్చిన నిధులను దారిమళ్ళించి తన ఖజానా నింపుకొన్నాడు అని  చాలాసార్లు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు కామెంట్ చేశారు. మరోపక్క గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో  బాబు విఫలమవడంతో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత రావడంతో...
Related image
తనమీద ఉన్న ప్రజావ్యతిరేకతను బీజేపీపై మళ్ళించడానికి చంద్రబాబు ప్రత్యేకహోదా పేరిట తన అనుచర వర్గానికి చెందిన మీడియా తో మోడీపై బీజేపీపై బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో బిజెపి రాష్ట్రానికి మోసం చేసిందని సంచలన కామెంట్లు చేసి ఎన్డీయే కూటమి నుండి బయటికి వచ్చేశారు చంద్రబాబు.
Related image
ఇదిలావుండగా తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ...2014 నుండి రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చిన నిధులు లెక్క చూసి ఆశ్చర్యపోయింది. కొన్ని లెక్కలను తప్పులతడకగా చూపించినట్లు ఆర్థిక శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఖర్చు అంచనాలు పెంచి చూపించడం , పాత పద్దులకు కొత్త గణాంకాలను చేర్చడం వంటి లోపాలనూ గుర్తించినట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంపై గడచిన ఏడాదిన్నరగా అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి వెళ్లిన నిధుల విషయంలో ఓ కమిటీ వేసి నిజనిర్ధారణ చేయాలని భావిస్తున్నట్లు టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: