వచ్చే ఎన్నికలల్లో గెలుపు కోసం అధికార టీడీపీ అడ్డ దారులు తొక్కుతోందని వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ అభిమానులు, ప్రజలు ఉన్నప్రాంతాలను  గుర్తించి మరీ ఓట్లను పెద్ద ఎత్తున తీయించి వేసే కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి జనాలలో ఉన్న ఆదరణ చూసి బెంబేలెత్తిపోయి చెస్తున్న కుట్ర ఇదే అంటూ ఫైర్ అయ్యారు.


వాళ్ళను తరిమికొట్టండి :


ఏపీవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలలో  ఇప్పటికి 16 లక్షల ఓట్లను ఈ విధంగా తీయించేశారని బొత్స అంటున్నారు. గ్రామదర్శిని  పేరిట అధికారులు గ్రామాలకు వచ్చి సర్వే అంటూ ఇళ్ళలోకి దూరి అన్ని వివరాలు ఆరా తీస్తున్నారని, వారు ఏ పార్టీ అభిమానులో తెలుసుకుని ఆ ఒట్లకు టిక్కు పెట్టేస్తున్నారని బొత్స అన్నారు. సర్వేల పేరిట అధికారులు ఇళ్లకు వస్తే తరిమికొట్టాలని బొత్స ప్రజలను కోరారు. దీనిపై తాము కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను కలసి టీడీపీ పై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 


 హోదాయే నినాదం :


బాబు జీవితకాలమంతా  యూ టర్న్ లతోనే  గడచిపోయిందని  బొత్స సెటైర్లు వెశారు. అన్నీ చేసేసి తాను ఒక్కటే మాట మీద ఉంటాను అనడం ఆయన దిగజారుడు రాజకీయమని  అన్నారు. ప్రత్యేక హోదా వచ్చే ఎన్నికలలో  వైసీపీ నినాదంగా  ఉంటుందని  బొత్స  చెప్పారు. దానినే జనంలో పెట్టి తీర్పు అడుగుతామని అన్నారు. ఈ నెల 9న గుంటూర్లో వంచనపై గర్జన పేరిట భారీ ఆందోళన కార్యక్రమం ఉంటుందని బొత్స  చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: