పవన్ మీద టీడీపీ అనుకూల మీడియా ఏ విధముగా దాడి చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాము. ఆ పత్రికలు టీడీపీ కి అనుకూలంగా ఉంటే ఒక విధంగా వ్యతిరేకముగా మాట్లాడితే మరో విధముగా రాస్తుంటుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీ ని విమర్శించడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి పచ్చ మీడియా దాడి చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా కత్తి మహేష్, శ్రీరెడ్డి విషయంలో టీవీ ఛానెల్స్ పవన్ కల్యాణ్ ని పర్సనల్ గా ఎలా టార్గెట్ చేశాయో ప్రత్యక్షంగా చూశాం.

Image result for pawan kalyan janasena

ఈ విషయంలో విసిగిపోయిన జనసేనాని అనుచరులతో కలసి సొంత టీవీ ఛానెల్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అనుకూల పత్రికల పాత్ర చెప్పేదేముంది. తిమ్మిని బమ్మిని చేయడంలో ఆ పత్రిక యాజమాన్యాలు దిట్ట. ఛానెల్స్ పవన్ కల్యాణ్ ని నైతికంగా దెబ్బతీయాలని చూస్తే, పత్రికలు ఆయన రాజకీయ ఎదుగుదలని అడుగడుగునా అడ్డుకుంటున్నాయి. ప్రతిపక్షాల మాటల్ని వక్రీకరించి చెప్పే ఈ పత్రికలు జనసేనానిని ఇటీవల బాగా టార్గెట్ చేశాయి.

Image result for pawan kalyan janasena

అప్పటివరకూ ఆహా.. ఓహో అని తన గురించి రాసిన పత్రికలే అభివృద్ధి వ్యతిరేకి, అమరావతిని అడ్డుకుంటున్నాడు అంటూ రాస్తుంటే పవన్ కి జ్ఞానోదయమైంది. అందుకే పవన్ సొంత పత్రికని తీసుకొచ్చాడు. సోషల్ మీడియా విభాగంగా శతఘ్నిని ప్రారంభించి.. ఇప్పుడు దాన్ని పక్షపత్రికగా విడుదల చేశాడు. దీనితో రాజకీయంగా టీడీపీ ని దాని మీడియా ను ఎదుర్కోవడానికి జనసేన మంచి ప్లాన్ తోనే ఉందని అర్ధం అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: