నిన్నటి వరకు ప్రజల చేత పూజలు అందుకున్న పాము అదే దుర్గాడ ప్రజలు సుబ్రమణ్య స్వామి హఠాన్మరణంతో తూర్పు గోదావరి జిల్లా దుర్గాడ శోకసంద్రమైంది.  కాగా తమ స్వామిని చంపింది స్థానిక ఎస్ఐ శివకృష్ణ కారణమని ఆరోపిస్తూ, ప్రజలు జాతీయ రహదారిని ఏడు గంటల పాటు దిగ్బంధించడంతో ఆ ఎస్ఐని విధుల నుంచి తప్పిస్తున్నట్టు డీఎస్పీ ప్రకటించారు.   అయితే వెటర్నరీ డాక్టర్లు, ఫారెస్ట్ అధికారులు మాత్రం పాము కుబుసం విడిచే సమంలో దానికి కళ్లు సరిగా కనిపించవని..అందుకే అది ఒకేదగ్గర మగతగా ఉంటుందని అంటున్నారు. 
दुआएं भी  नहीं बचा पाई सांप की जान, मंदिर बनाने की तैयारी
అయితే గత కొన్ని రోజులు నుంచి పామును స్వేచ్ఛగా తీరగనివ్వకుడా ఎండలో ఉంచి..దానికి నానా రకాల తిండి పదార్థాలు పెట్టడం వల్ల చనిపోయి ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం..ఓ వస్త్రం తెచ్చి, దానిపై మందు వేసి పామును ఆయన చంపించాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుబుసం విడిచిన తరువాత కూడా ఎక్కడికీ వెళ్లకుండా, తమతోనే ఉన్న పాము వద్ద ఎస్ఐతో పాటు వచ్చిన వ్యక్తి ఓ వస్త్రాన్ని వదిలి వెళ్లాడని, ఆపై కాసేపటికే పాము మృతి చెందిందని గ్రామస్తులు ఆరోపించారు. 

ఎస్సై కావాలనే ఆ పని చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై జాతీయ రహదారి నంబర్ 216పై పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలకు దిగారు. రోడ్డుపై మంటలు వేశారు. దీంతో ట్రాఫిక్ ను చెందుర్తి, తాటిపర్తి సెంటర్ మీదుగా మళ్లించిన అధికారులు, దుర్గాడ ప్రజలతో చర్చలకు ఉన్నతాధికారులను పంపారు.  ఎస్ఐని విధుల నుంచి తొలగిస్తున్నామని, పాము మృతిపై విచారణ జరిపిస్తామని, కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని నచ్చజెప్పడంతో ప్రజలు శాంతించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: