జ‌నసేన‌లో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాలు  చూస్తుంటే పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్  స్వ‌తంత్రంగా ముందుకెళ్ళ‌లేని ప‌రిస్ధితుల్లో ఇరుక్కున్నారా  అన్న సందేహాలు వ‌స్తోంది.  ఒక‌వైపు ఎన్నిక‌లు త‌రుముకొస్తున్నాయి. మ‌రోవైపు పార్టీలో ప‌వ‌న్ త‌ప్ప చెప్పుకోత‌గ్గ రెండో నేత క‌న‌బ‌డమే లేదు. ఈ ప‌రిస్దితుల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంటు స్ధానాల్లో జ‌న‌సేన ఏ విధంగా పోటీ చేయ‌గ‌లుగుతుంది ?  పార్టీ యంత్రాంగాన్ని  స‌మ‌ర్ద‌వంతంగా  ముందుకు న‌డిపించ‌గ‌లిగిన అడ్మినిస్ట్రేష‌నే క‌న‌బ‌డ‌టం లేదు.  రాష్ట్రంలో యాత్ర‌లు చేయ‌టానికి, అభ్య‌ర్ధుల త‌ర‌పున ప్ర‌చారం చేయ‌టానికే  ప‌వ‌న్ కు స‌మ‌యం స‌రిపోదు. అటువంటిది పార్టీ పాల‌నా వ్య‌వ‌హారాలు కూడా ప‌వ‌నే చేసుకోవాలంటే ఎలా సాధ్యం ?  


కోట‌రి ద‌డి క‌ట్టేసిందా ?

Image result for janasena reviewmeeting

సినిమాల్లో తెర మీద న‌టించే వాళ్ళు ఎంత ముఖ్య‌మో తెర వెనుక ప‌నిచేసే వాళ్ళు కూడా అంతే అవ‌స‌రమ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.  ఇక్క‌డే ప‌వ‌న్ ఓ విష‌యం మ‌రచిపోయారు. పార్టీ వైపు నేత‌ల‌ను ఆక‌ర్షించ‌టానికి, యాత్ర‌లు చేయ‌టానికి ప‌వ‌న్ పై పెద్ద బాధ్య‌తే ఉంది. అదే స‌మ‌యంలో పార్టీ యంత్రాంగాన్ని స‌మ‌ర్ధ‌వంతంగా న‌డ‌ప‌టానికి తెర‌వెనుక ఉండి చిత్త‌శుద్దితో ప‌నిచేయ‌టానికి చాలా మందే అవ‌స‌రం. అంత చిత్త‌శుద్దితో ప‌నిచేసే వారు జ‌న‌సేన‌లో ఉన్నారా ? అన్న‌దే ఇపుడు పెద్ద ప్ర‌శ్న‌. జ‌న‌సేన‌లో ప‌వ‌న్ చుట్టూ ఓ కోట‌రి ద‌డి క‌ట్టేసింద‌నే  ఆరోప‌ణ‌లు విన‌బడుతున్నాయి. ఇత‌ర పార్టీల నుండి కానీ కాపు సామాజిక‌వ‌ర్గంలోని ప్ర‌మఖులెవ‌రైనా స‌రే ప‌వ‌న్ తో మాట్లాడాలంటే సాధ్యం కావ‌టం లేద‌ట‌. 


అభ్య‌ర్ధుల ఎంపిక ఎలా ?


వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ట్టి  అభ్య‌ర్ధుల‌ను ఎంపిక చేయాలంటే అంత ఈజీ కాదు. అందుకు రాష్ట్రంలోని అన్నీ జిల్లాల రాజ‌కీయాల‌పైనా బాగా ప‌ట్టుండే నేత‌లకే సాధ్యమ‌వుతుంది. అభ్య‌ర్ధుల‌ను ఎంపిక చేయ‌ట‌మంటే ద‌ర‌ఖాస్తులు తీసుకుని కంటెంట్ రైట‌ర్ల‌ను ఎంపిక చేసినంత సుల‌భం కాదు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వంతో పాటు పాల‌నా అనుభ‌వం  ఉన్న వారికే సాధ్య‌మ‌వుతుంది. అటువంటి వారిని ప‌వ‌న్ ఎంపిక చేసుకోవాలంటే ఇత‌ర పార్టీల నేత‌ల‌కు పెద్ద పీట వేయాల్సిందే. ఏదో ఓ కోట‌రిని పెట్టుకుని రాజ‌కీయం చేసేద్దామంటే అది నికార్స‌యిన రాజ‌కీయం అనిపించుకోదు. 


కోట‌రీ నిర్ణ‌య‌మే ఫైన‌లా ?  

Image result for janasena reviewmeeting

జ‌న‌సేన‌లో చేర‌టానికి ఎవ‌రూ  ఎందుకు ముందుకు రావ‌టం లేదు ?  అంటే, ప‌వ‌న్ చుట్టూ ఉన్న కోట‌రీనే కార‌ణ‌మ‌నే స‌మాధానం వినిపిస్తోంది. జ‌న‌బ‌ల‌మున్న నేత‌ల‌ను, వివిధ రంగాల్లో మేధావుల‌ను ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళ‌కుండా కోట‌రీనే అడ్డుకుంటోంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.  జ‌నాల్లో ఏమాత్రం బేస్ లేని వాళ్ళే కోట‌రీలో ఉన్నార‌నే ఆరోప‌ణ‌లు విన‌బ‌డుతున్నాయి.  ఇటువంటి వాళ్ళ‌ని ప‌క్క‌న పెట్టుకుని జ‌న‌సేన‌కు  ' పోరాడే సేన'   కావాలంటే ఎలా వ‌స్తుందో  ప‌వ‌నే ఆలోచించాలి. అదే స‌మ‌యంలో కాపు సామాజిక‌వ‌ర్గ ప్ర‌యోజ‌నాల కోసం చిత్త‌శుద్దితో ప‌నిచేసే వారెవ‌రో ప‌వ‌న్ గ్ర‌హించి వారిని కూడా పార్టీలోకి  ఆహ్వానించాల్సిందే.  ఆ పనులు చేయాలంటే స్వ‌తంత్ర నిర్ణ‌యాలు తీసుకోవాలే కానీ కోట‌రీపై ఆధార‌ప‌డో లేక‌పోతే అన్నీ విష‌యాలు కోట‌రికి వ‌దిలిపెట్టేస్తే స‌రిపోతుంద‌నో అనుకుంటే....


మరింత సమాచారం తెలుసుకోండి: