అట్లాంటిక్ సముద్రంలో బెర్ముడా, శాన్ యువాన్, మయామీ మద్యన గల ఐదులక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి బెర్ముడా ట్రయాంగిల్ అని పేరు.  అట్లాంటిక్ సముద్రంలో మయామి.. సాన్ యువాన్.. ప్యూర్టోరికో మధ్యనున్న 7 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి బెర్ముడా ట్రయాంగిల్ అని పేరు. మృత్యువునకు కేరాఫ్ అడ్రస్ గా ఈ ప్రాంతాన్ని చెబుతారు. ఈ ముక్కోణపు ప్రాంతం ఎంతో మంది ప్రాణాలకు గండంగా మారింది.  దాని మీదుగా ప్రయాణించే నౌకలు, విమానాలు అంతుచిక్కని రీతిలో అదృశ్యమవుతాయని అంటారు.
Bermuda Triangle Mystery Solved - Sakshi
గత వందేండ్లలోనే 75 విమానాలు, లెక్కలేనన్ని నౌకలు అక్కడ గల్లంతయ్యాయని చెప్పుకుంటారు. వెయ్యిమందిని బెర్ముడా ట్రయాంగిల్ పొట్టన పెట్టుకున్నదని కొందరు లెక్క కూడా తేల్చారు. అసలు ఏముంది అక్కడ, ఇన్ని ఓడలు మునిగిపోవడానికి కారణమేంటి..? ఏలియన్‌లా.. లేక ఏదైనా బ్లాక్‌ మ్యాజికా.. ఇన్నాళ్లుగా సామన్యుల నుంచి శాస్త్రవేత్తల దాకా ఆలోచింపచేసిన ఈ మిస్టరీకి సమాధానం దొరికిందంటున్నారు సైంటిస్టులు. చానల్ 5 ఒక డాక్యుమెంటరీలో తాజాగా వెల్లడించింది.
Swaraj
ఈ డాక్యుమెటరీకోసం పలువురు శాస్త్రవేత్తలతో ఆ చానల్ మాట్లాడింది. చివరకు 100 అడుగుల వరకు ఎగిసే రాకాసి అలలే అసలుసిసలు కారణం అని తేల్చింది. ఇవి మామూలు అలల కన్నా చాలా ఎత్తుగా.. ఒకదానివెంట మరొకటి అతివేగంగా విరుచుకుపడతాయి. ఒకేసారి వేరువేరు దిశల నుంచి తుఫాన్లు చుట్టుముట్టడమే ఈ పరిస్థితికి కారణమట. సముద్రం ఎక్కడైనా సముద్రమే. కానీ బెర్ముడా ట్రయాంగిల్‌లో కొంచెం భిన్నమైన పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.   

ప్రశాంతంగా ఉన్న వాతావరణం క్షణాల్లో మారిపోతుందని.. వివిధ దిశల నుంచి వచ్చే తుఫాన్లు అక్కడ తీవ్రంగా మారిపోయి క్షణాల్లో ప్రళయంగా మారుతుందని..ఆ సమయంలో వంద అడుగుల ఎత్తులో బలమైన అలలు.. వేగంగా ఒకటి తర్వాత ఒకటిగా విరుచుకుపడతాయని.. వాటి ఉధృతికి అటువైపు వెళ్లే విమానాలు.. ఓడలు మునిగిపోవటమే కాదు.. ఆ వేగానికి ఏటు కొట్టుకు వెళతాయో అర్థం కాని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అందుకే వాటి ఆచూకీ ఇప్పటికీ కనిపెట్టలేక పోయారని అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే  ఆ రాకాసి అలలకు ‘రోగ్స్ వేవ్స్’ అన్న పేరును పెట్టేశారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: