విశాఖ జిల్లా అంటే ఇపుడు అతి పెద్ద భూ స్కాం గుర్తుకు వస్తుంది. ప్రభుత్వం, ప్రైవేట్ అన్న తేడా లేకుందా వందల, వేల ఎకరాలను జిల్లాలో దోపిడీ చేశారు. ఇందులో అధికార పార్టీ నాయకుల హస్తం ఉందన్నది  బహిరంగ రహస్యం. ఈ కబ్జాపై ఏకంగా అధికార పార్టీకి చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడే మొదట నోరు చేశారు. బాధ్యులపై  చర్యలకూ డిమాండ్ చేశారు. ఇదే టైంలో ప్రతిపక్షాలు కూడా రోడ్డుపైకి వచ్చి ఉద్యమించడంతో ఎట్టకేలకు పోయిన ఏడాది చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బ్రుందం (సిట్ )తో విచారణ జరిపించింది. సిట్ విచారణ చేసి నివేదిక ఇచ్చేసి కూడా నెలలు దాటుతోంది. అయినా ఆ నివేదికలో ఏముందన్నది ఇప్పటివరకూ వెలుగు చూడలేదు.


తమ్ముళ్ళే ఉన్నారట:


:చంద్రబాబు ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకులు చేసిన భూ దందా విలువ 2,500 కోట్ల రూపాయలుగా సీపీఐ రామక్రిష్ణ లెక్క తేల్చారు. దీనిపైన యాక్షన్ ఏదీ అంటూ ఆయన చంద్రబాబుని నిలదీశారు. సిట్ విచారణ దాచిపెట్టడం వెనక మతలబు ఏంటని ప్రశ్నించారు. అంతా మీ పార్టీ వారే ఉన్నారని విజయనగరంలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ,ఓ రేంజిలో బాబుపై ఫైర్ అయ్యారు. మా పోరాటం ఫలితంగా వేసిన సిట్ నివేదిక బయటపెట్టకపోతే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.


మేమే బయటేస్తాం :


చంద్రబాబు సర్కార్ కి రామక్రిష్ణ డెడ్ లైన్ పెట్టారు. ఈ నెల 10వ తేదీలోగా సిట్ నివేదిక బయటపెట్టకపోతే తామే విశాఖలో మీటింగ్ పెట్టి మరీ కబ్జాకోర్ల లిస్ట్ జనాల  ముందు పెడతామన్నారు. ప్రజలను, ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే పోరాడక తప్పదని కూడా అన్నారు. తమ లిస్ట్ బయటకు వస్తే టీడీపీ తమ్ముళ్ళే అందులో ఉంటారని కూడా చెప్పడం విశేషం. మొత్తానికి ఎర్రన్న ఆగ్రహం చూస్తూంటే ఎన్నికల టైంలో  బాబుకు, తమ్ముళ్ళకూ విశాఖలో పరువు పోయేలా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: