చంద్ర బాబు ఆంధ్ర ప్రదేశ్ లో ఏ పధకాన్ని ప్రవేశ పెట్టిన తన పేరు పెట్టుకోవడం సహజం. ఎందుకంటే చంద్ర బాబు కు ఉన్న పబ్లిసిటీ పిచ్చి అందరికీ తెలిసిందే. ప్రతి పధకం లో తన పేరు మారు మ్రోగి పోవాలి. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పథకాలకు ఇందిర, రాజీవ్‌, నెహ్రూల పేర్లు పెట్టారు. ఇది మరీ ఓవరైందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబును చూస్తే వైఎస్‌ఆర్‌ చాలా నయమని చెప్పొచ్చు. ఆయన దివంగత నేతలు పేర్లు ఎక్కువ పథకాలకు పెట్టారుగాని తన పేరు పెట్టుకొని కీర్తి కండూతి తీర్చుకోలేదు.

Image result for chandrababu naidu

అసలు ఉమ్మడి ఏపీలో ఏ ముఖ్యమంత్రి బాబులా వ్యవహరించలేదు. అధికారంలోకి రాగానే చంద్రన్న బీమా, చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న రంజాన్‌ తోఫా, చంద్రన్న క్రిస్మస్‌ కానుక, చంద్రన్న కాపు భవన్‌..  ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉంది. ప్రభుత్వ పథకాలకు ముఖ్యమంత్రి తన పేరు పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు కారణం ఈ పథకాలకు ఖర్చు చేసేది ప్రజాధనం కాబట్టి.

Image result for chandrababu naidu

ఇక అసలు విషయానికొస్తే నాలుగేళ్లుగా పెండింగ్‌లో పెట్టిన నిరుద్యోగభృతిని ఎట్టకేలకు బాబు పట్టాల పైకి ఎక్కించారు. రాష్ట్రంలో 12 లక్షలమంది మాత్రమే నిరుద్యోగులున్నారని తేల్చి వారికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున భృతి ఇవ్వడానికి మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కాబట్టి చివరకు మమ అనిపించారు. ఇదో 'గొప్ప పథకం' కాబట్టి దీనికి చక్కటి పేరుండాలి కదా. వెంటనే కుమారుడు లోకేష్‌ 'యువ నేస్తం' అనే పేరు పెడదామన్నాడు. ఉత్తగా యువ నేస్తం అనడం బాగాలేదని, 'చంద్రన్న యువ నేస్తం' అని పెడదామని మంత్రి దేవినేని ఉమ అన్నాడు. కాని చంద్రబాబు మొహమాట పడిపోయి ఇప్పటికే తన పేరు చాలా పథకాలకు ఉంది కాబట్టి దీనికి చంద్రన్న వద్దన్నారట. చివరకు అంతా ఆలోచించి ''ముఖ్యమంత్రి యువ నేస్తం''అని పెట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: