టీడీపి ప్రకటించిన నిరుద్యోగ భృతి రాష్ట్రం లో ఉన్న నిరుద్యోగ యువతను విస్మయానికి గురి చేస్తుంది. రాష్ట్రం లో ఉద్యోగాలు కల్పించమని మొర్రో అని మొత్తుకుంటే బిచ్చం వేసినట్టు 1000 రూపాయలు ప్రకటించారు. ఈ డబ్బులతో ఏడవాలో.. నవ్వాలో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇది ఉద్యోగాల కల్పనలో టీడీపీ కి ఉన్న చిట్టా శుద్ధి అని విమర్శలు వినిపిస్తున్నాయి. 22 నుంచి 35 ఏళ్ళలోపు నిరుద్యోగ యువతకు ఈ నిరుద్యోగ భృతి వర్తిస్తుందట.

Image result for chandrababu naidu

ఒక్కొక్కరికి నెలకి వెయ్యి రూపాయలు. ఏడాదికి దాదాపు 1400 కోట్ల ఖర్చవవుతుందనే అంచనాలు వేసింది చంద్రబాబు సర్కార్‌. ఏడాది సంగతి తర్వాత.. పదినెలల్లో ఎన్నికలు జరుగుతాయి గనుక.. ఒక్కో ఓటుకి 10 వేల రూపాయల చొప్పున లెక్క గట్టినట్టుంది వ్యవహారం. అన్నట్టు, వృద్ధాప్య, వితంతు పించన్ల మొత్తం కూడా దాదాపు నెలకు వెయ్యి రూపాయలు పలుకుతోందిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో. నిరుద్యోగ యువతని కూడా అదే 'నిస్సహాయ' కేటగిరీలోకి చంద్రబాబు సర్కార్‌ నెట్టేయడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

Image result for chandrababu naidu

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు.. ఉద్యోగాన్వేషణలో వున్నవారికి ఈ 'నిరుద్యోగ భృతి' ఉపయోగపడ్తుందనీ, సొంత ఖర్చులకు కుటుంబంపై ఆధారపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతున్న మాటలు వినడానికి బాగానే వుంటాయిగానీ... తెరవెనుక పాలకుల ఆలోచనలు ప్రజలకు అర్థంకాకుండా వుంటాయా..? చిత్రమేంటంటే, 'ముఖ్యమంత్రి యువ నేస్తం' పేరుతో చంద్రబాబు సర్కార్‌ తెచ్చిన నిరుద్యోగ భృతి పథకం పట్ల టీడీపీ అనుకూల మీడియాకి సైతం సానుకూలమైన రిపోర్ట్స్‌ రావడంలేదు. ఆయా ఛానళ్ళు, పత్రికలు .. చంద్రబాబుకి బాకా ఊదేందుకు నిరుద్యోగుల దగ్గరకు వెళుతోంటే, ఇటు ఆ మీడియా ప్రతినిథుల్నీ, ఇటు చంద్రబాబు సర్కార్‌నీ కడిగిపారేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: