మన ఎంపీలు డిల్లీలో గడగడలాడించారంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. కేంద్రాన్ని వణికించేశారని, కదిలించేశారని ఎవేవో కధలు చెబుతున్నారు. నిజానికి అక్కడ ఏం గడగడలు, వణకడాలు అసలు కనిపించడంలేదు. పైగా మన ఎంపీలు డిల్లీలో చేస్తున్న విన్యాసాలు చూసి తెలుగు జాతి సిగ్గుపడుతోంది.  ఓ ఎంపీ గారు వేస్తున్న వేషాలకు అంతూ పొంతూ లేకుండా పోంతోంది. దీంతో తెలుగు వారు తమ పరువు తీస్తున్నారని బాధ పడుతున్నారు.


వీరోచితంగా  పోరాడుతున్నారట :


టీవీలూ, మీడియాలూ లేని రోజులలో  స్టోరీలు చెబితే బాగుంటుంది. కానీ అన్ని అందుబాటులోకి వచ్చిన ఈ టైంలో బాబు గారు ఇలా కాకమ్మ కధలు చెబుతూంటే వినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. క్రిష్ణా జిల్లాలో ఈ రోజు గ్రామదర్శిని సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్రంపై పోరాటం చేసెది తమ పార్టీయేనని చెప్పుకున్నారు. ఎంపీలు అక్కడ ఓ లెవెల్లో మోదీని  నిలదీస్తున్నారని చెప్పారు.


ఇదీ కదా సంగతి :


ఏపీకి చెందిన ఎంపీలు తెల్లారిలేస్తే ఏం చేస్తున్నారో మీడియా బాగానే చూపిస్తోంది. ఓ ఎంపీ గారు రోజుకో విచిత్ర వేషం వేస్తూ పార్లమెంట్ ముండు పరువు తీస్తున్నారు. ఇక గాంధీ బొమ్మ ఎదుట ప్లే కార్డులు పట్టుకుని కొంతసేపు పోజులు ఇచ్చేసి ఆనక ఎంపీలు వెళ్ళిపోతున్నారు. దీనిని పోరాటమని అందామా.  మిగిలిన పార్టీలను కలుపుకుంటున్నారుట. నిన్నా మొన్నటి సంగతే తీసుకుంటే యూపీకి చెందిన రాజకీయ కురు వ్రుధ్ధుడు ములాయం సింగ్ యాదవ్ పార్లమెంట్ నుంచి బయటకు వస్తూండగా బలవంతంగా ఆయన చేతిలో ప్లే కార్డ్ పెట్టేశారు మన పసుపు పార్టీ ఎంపీలు. దాంతో బలవంతంగా పట్టుకుని ఉండగానే పోటొ తీసేశారు.



అలాగే మాజీ ప్రధాని దెవెగౌడదీ సేం  టూ  సేం . ఆయనను ఇబ్బంది పెట్టి పోటో కోసం కాసేపు ఉండమన్నారట. ఇలా విలువైన పార్లమెంట్ సమయం వ్రుధా చెస్తూ ఎంపీలు డిల్లీలో చేస్తున్న విన్యాసాలు  ఇవీ అంటూ సోషల్ మీడియా ఓ వైపు ఏకుతూంటే బాబు గారు మాత్రం ఏదో పోరాటం అంటున్నారు. ఇంతకీ ఈ పోరటాలకు  ఏమైనా  కేంద్రం దిగి వచ్చిందా, ఏమైనా ఇచ్చిందా అంటే ఏమీ లేదు. ఈ టైప్ కామేడీని చూసి అదే ఉద్యమం, పోరాటం అని బాబు అనుకోవడమే కాడు జనాల్ని సైతం  మభ్యపెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: