ఆంధ్రరాష్ట్రాన్ని తమ రాజకీయ లబ్ధి కోసం విభజించిన కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ పెద్దల పై..రాష్ట్ర ప్రజలకు పీకలదాకా కోపం ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ఇదిలావుండగా తాజాగా ఇటీవల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి సమైక్యాంధ్ర పార్టీ వ్యవస్థాపకుడు కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.

Image result for kiran kumar reddy

ఈ క్రమంలో పార్టీలోని గ్రూపు తగాదాలు పెరిగిపోతున్నాయట..దీంతో మరింత ఇబ్బందులు ఎదురవుతు‎న్నాయట. కాంగ్రెస్‌లో సుధీర్ఘకాలంనుంచి ఉన్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు, కిరణ్‌కుమార్‌రెడ్డిల మధ్య వర్గపోరు నడుస్తోందట.. ఇద్దరికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని, పార్టీని బలోపేతం చేసే విషయంలో కాకుండా ఒకరు జగన్‌ కు మరొకరు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి ఉవ్విళ్లూరుతుండడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుస్తోంది.

Image result for kiran kumar reddy kvp

మొదటినుంచి కాంగ్రెస్‌లో ఉండి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఆత్మగా వ్యవహరించిన కేవీపీ తన స్నేహితుడి కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని గతంలో ఓసారి వదులుకున్నాం కనుక ఇప్పుడు ఆయనకు ఎలాగో అండగా ఉండలేము కానీ టీడీపీకి సపోర్ట్ ఇవ్వొద్దని చెప్తుంటే ఈ మాజీ ముఖ్యమంత్రి మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రికి మద్దతివ్వాలంటున్నారట..

Image result for kvp ramachandra rao

జగన్‌ బలహీనమైతే కాంగ్రెస్‌ పుంజుకుంటుందని వాదిస్తున్నారట. వీరిద్దరి మధ్య జరుగుతున్న గొడవ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల దృష్టిలో కి వెళ్లినట్లు సమాచారం. మరి కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరి వాదనకు మద్దతు తెలుపుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: