వైసిపీ నాయకులూ ఈ మధ్య అధికారుల మీద నోరు పారేసుకుంటున్నారు. అధికారుల ను నోటికొచ్చినట్టు భూతులు కూడా మాట్లాడటానికి వెనుకాడటం లేదు అయితే ఈ పద్ధతి మార్చుకోకపోతే ఎన్నికలు వస్తున్నా వేళ ఇబ్బంది తప్పదు అని చాలా మంది హెచ్చరిస్తున్నారు. మొన్నటికి మొన్న కొడాలి నాని వైసిపి కార్యకర్తల జోలికి వస్తే ఎన్నికల తరువాత మీ కథ తేలుస్తానని మున్సిపల్ అధికారులను హెచ్చరించడం మరువక ముందే తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా పోలీసులపై బూతుల వర్షం కురిపించడం, నేడు వైసిపి సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి సిబిఐ అధికారులను ఊరకుక్కలతో పోల్చడం చర్చనీయాంశంగా మారుతోంది.

Related image

ఎన్నికలు సమీపిస్తున్నవేళ వైసిపి నేతలు ఎందుకు సహనం కోల్పోతున్నారు. అధికార పార్టీ నాయకులను వదిలి అధికారులపై ఎందుకు విరుచుకుపడుతున్నారు. వైసిపి నేతలకు అసలేమైంది. గత కొన్ని రోజులుగా వైసిపి నేతలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో.. ఎవరిని విమర్శిస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారా.. అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులను టార్గెట్‌గా చేసుకుని మాటల దాడులకు దిగుతున్న వైసిపి నేతల తీరు సర్వత్రా విమర్శల పాలవుతోంది.  

Image result for ysrcp mla

కొన్నిరోజుల క్రితం గుడివాడ ఎమ్మెల్యే నాని నాని తాము అధికారంలోకి వస్తే టిడిపికి వత్తాసు పలుకుతున్న అధికారుల సంగతి చూస్తామంటూ హెచ్చరించారు. నాని వ్యవహారశైలిపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంగతి మరువకముందే నగరిలో పోలీసు అధికారులపై బూతుల వర్షం కురిపించారు.అయితే వైసిపి నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై అధికారులు, ఇతర ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా తాము వ్యవహరించాల్సి వస్తోందని, రాజకీయాలతో తమకు సంబంధం లేదని వారంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: