అధికార టీడీపీలో ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే కొంత మంది నేత‌ల్లో కీల‌క‌మైన నేత‌, టీడీపీలో సీనియ‌ర్‌గా కొన‌సాగుతు న్న మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు. ఈయ‌న విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.  ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవులు చేపట్టిన చింతకాయల అయ్యన్న పాత్రుడుపై ప్రధాన అనుచరులే తిరుగుబాటు చేసి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీపడిన సందర్భాలు ఉండటం విశే షం. ఇక్క‌డ తొలిసారి ఎన్నికలు జరిగిన 1955 నుంచి నర్సీపట్నం రాజకీయాలను కేవ లం రెండు కుటుంబాలు ప్రభావి తం చేస్తున్నాయి. తంగేడు రాజులుగా ప్రసిద్ధి చెందిన రాజా సాగి సూర్యనారాయణరాజు, రాజాసాగి సీతారామరాజు కుటుంబీకులు, వారి వారసులు కృష్ణమూర్తి రాజు, రామచంద్రరాజు, రామభద్రరాజు, చంటిబాబురాజు, జానకి రామ రాజు, సూర్య నారాయణరాజు తదితరులు పలు పదవులు చేపట్టారు.

నియోజకవర్గాల పునర్విభజనలో కోటవురట్ల మండలం పాయకరావుపేట నియోజకవర్గంలో కలిసినా, తంగేడు రాజుల ప్రభావం నర్సీపట్నం నియోజకవర్గ ఓటర్లపై కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తాత రుత్తల లత్సాపాత్రుడు హయాం నుంచి తంగేడు రాజులకు ప్రత్యర్థి రాజకీయ కుటుంబంగా కొనసాగుతున్నారు.
Image result for టీడీపీ ఆవిర్భావం
టీడీపీ ఆవిర్భావం తరువాత వీరి కుటుంబం రాజకీయంగా మరింత బలపడింది. వారసులుగా అయ్యన్న పాత్రుడుతో పాటు తమ్ముడు సన్యాసి పాత్రుడు, అతని సతీమణి వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. 1983 నుంచి అయ్య‌న్న టీడీపీలోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. అప్ప‌టి ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాలు సాధించారు 
 
అయితే,  పార్టీలో రాజకీయ పాఠాలు నేర్పిన గురువు అయ్యన్నపాత్రుడుపై నర్సీపట్నం మండలం వేములపూడి బోళెం కుటుంబీకులు 1996లో జరిగిన ఉప ఎన్నికల్లోనే తిరుగుబాటు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన బోళెం గోపాత్రుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి, టీడీపీ టిక్కెట్టుపై నర్సీపట్నం మండల పరిషత్‌ అధ్యక్షుడిగా రెండు సార్లు పదవి చేపట్టిన బోళెం వెంకటరమణమూ ర్తి 1996 ఉపఎన్నికల్లో అయ్య న్నపాత్రుడుపై తిరుగుబాటు చేసి ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా రంగంలోకి దిగి గట్టి పోటీ ఇచ్చారు. రెండున్నర దశాబ్దాల పాటు టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయకులుగా కొనసాగి తిరుగుబాటు చేసిన మాజీ మండల అధ్యక్షుడు బోళెం వెంకటరమణమూర్తికి కాకుండా, అతని సతీమణి బోళెం ముత్యాల పాపకు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టిక్కెట్టు లభించింది. 
Related image
దాంతో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభంజనాన్ని తట్టుకుని కూడా 24 వేల ఓట్ల ఆధిక్యంతో ఎన్నికైన అయ్యన్నపాత్రుడు ముత్యాలపాప చేతిలో 8,760 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఫలితంగా ద్వితీయ శ్రేణి నాయకత్వ తిరుగుబాటు తొలిసారి విజయం సాధించినట్టయింది. అదే బాటలో అయ్యన్న మరో ప్రధాన అనుచరుడు పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ తిరుగుబాటు చేయడమే కాకుండా 2014 ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడుకి ప్రత్యర్థిగా నిలిచారు. కోటవురట్ల మండల టీడీపీ అధ్యక్షుడిగా, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా గణేష్‌ పనిచేయగా, అతని తల్లి బాపిరాజు కొత్తపల్లి సర్పంచ్‌గా, భార్య ఎంపీటీసీ సభ్యురాలిగా కూడా గెలుపొందారు. అయినప్పటికీ వైఎస్  మరణాంతరం వైసీపీలో చేరిన గణేష్‌కు పార్టీ అధ్యక్షుడు జగన్‌ అసెంబ్లీ టికెట్టు ఇచ్చి ప్రోత్సహించారు.
 
దాంతో అయ్యన్నపాత్రుడుకు 2014 ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన ఉమాశంకర్‌ గణేష్‌ 2,338 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1982 నుంచి టీడీపీలో ఉంటూ మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ,ఐదుసార్లు మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అయ్యన్నపాత్రుడుకు 2009, 2014 ఎన్నికల్లో అనుచరులే ప్రధాన ప్రత్యర్థులుగా నిలవడం ఆయన రాజకీయ జీవితంలో మరచిపోలేని సంఘటనలు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితులు ఎలా మార‌తాయోచూడాలి. ఏదేమైనా.. రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు అన‌డానికి ఈఉదాహ‌ర‌ణ ఒక్క‌టి చాల‌ని అంటున్నారు.. ప‌రిశీల‌కులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: