మహానటుడు ఎంటీఆర్ బయోపిక్ ఇపుడు జనాలలో ఆసక్తి కలిగిస్తోంది. అయితే చిత్ర యూనిట్ ఆ ఆసక్తిని చంపేసే విధంగా వ్యవహరిస్తోంది. లేటేస్ట్ గా అమరావతి వెళ్ళి చంద్రబాబుని హీరో బాలయ్య, దర్శకుడు క్రిష్ కలవడం చర్చకు దారితీస్తోంది. మొదటి నుంచి అనుకుంటున్నట్లుగా ఈ మూవీలో అన్న నందమూరి అసలైన జీవితం వెలుగు చూసే అవకాశాలు చాలా తక్కువ అన్నది ఈ భేటీ తరువాత పూర్తిగా తెలిసిన నిజం.


స్టోరీయే వేరుగా :


అన్న గారి బయోపిక్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకువచ్చేది 1995లో ఆయన ఘోరాతిఘోరంగా సీఎం సీటు నుంచి సొంత కుటుంబసభ్యులే లాగి దించేయడం. మరి బాలక్రిష్ణ సినిమా తీయడం, పైగా ఆయన గారు ఇపుడు రామారావు కుమారుడు కంటే బాబు గారి వియ్యంకుడు, ఇంకా చెప్పాలంటే లోకేష్ మామ అన్న ట్యాగ్ లైన్ తో ఉన్న తరువాత ఎంటీఆర్  మూవీలో ఆ సీన్లు ఉంటాయని ఎవరూ అనుకోలేదు. అది సరే అన్న నందమూరి తొలిసారి సీఎం గా ప్రమాణం వరకూ మాత్రమే ఈ బయోపిక్ ఉంటుందని తాజాగా తెలుస్తున్న మాటర్. మరి ఇందులోనూ చాలా  సీన్లు మిస్ అయ్యే చాన్స్ ఉందని ఇపుడే అనుమానాలు వస్తున్నాయి.


ఆ సీన్లే కట్ :


అంతా చంద్రబాబు కనుసన్నలలో మూవీ కాబట్టి ఆయనకు ఇబ్బంది కలిగే సీన్లు ఉండవు. దీనిపై అందరికీ పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు ఎంటీఆర్ మొదట పిలిచింది చంద్రబాబునే. అయితే అపుడాయన కాంగ్రెస్ మంత్రి. అధికారంలో ఉన్న పార్టీలో ఓ వెలుగు వెలిగిపోతున్నాడు. దాంతో టీదీపీలో చేరలేదు సరికదా ఎంటీఆర్ కు  అసలు ఎందుకు రాజకీయాలంటూ ఎకసెక్కం ఆడారని మరో తోడల్లుడు దగ్గుబాటి రాసిన పుస్తకంలోనే ఉంది


ఆ విధంగా  చూసుకున్నపుడు కాంగ్రెస్ తో పాటూ చంద్రబాబు కూడా అన్న గారికి రాజకీయ విలన్లే. ఆ తరువాత ఏకంగా ఎంటీఅర్ మీదనే పోటీ చేస్తానంటూ బాబు పలికిన ప్రగల్బాలు  కూడా అప్పటి పత్రికలలో భద్రంగా ఉన్నాయి. మంత్రి హోదాలో కాంగ్రెస్ టికెట్ పై చంద్రగిరి నుంచి 1983లో పోటీ చేసిన చంద్రబాబును టీడీపీ తరఫున అన్న గారు నిలబెట్టిన ఓ సాధారణ అభ్యర్ధి  ఘోరంగా ఓడించేశాడు. ఇదీ అసలైన చరిత్ర. మరి ఈ సీన్లు బాలయ్య మూవీలో ఉంటాయా. అంటే అసలు ఉండే అవకాశమే లేదని చెప్పాలి.


రేపటి ఎన్నికలకు ఈ చిత్రాన్ని  ఆయుధంగా మార్చుకోవాలని ,ఓట్ల పంట పండించుకోవాలని తెగ ఆరాటపడుతున్న బాబుకు ఇబ్బంది పెట్టే ఈ సీన్లు ఎందుకుంటాయి. కాకపోతే ఎంటీఆర్ కు బాబు ముద్దుల అల్లుడని, బాబు ప్రతిభా పాటవాలు, అసమాన రాజకీయ సామర్ధ్యం ఎంటీఆర్ నచ్చి, మెచ్చి కూతురుని ఇచ్చాడన్న సీన్లు మాత్రం ఫుల్ గా ఉంటాయి. సో ఈ బయోపిక్ అన్నగారి అసలు జీవితాన్ని చెప్పదన్నది ష్యూర్. అందువల్ల అన్న గారి అభిమానులూ పెద్దగా అశలు పెంచుకోకండి. జస్ట్ అది ఒక మూవీ అంతే. 


మరింత సమాచారం తెలుసుకోండి: