చంద్రబాబు, మోడీ ఒక్కటేనని, పైకి మాత్రం వేరు అయినట్లుగా నాటకాలు ఆడుతున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె ఇది నిజం కాకపోతే బాబు అవినీతిపై మోడీ ఎందుకు విచారణ జరిపించరంటూ లాజిక్ పాయింట్ తీసారు. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను గమనించి ఆ రెండు పార్టీలు విడిపోయినట్లుగా డ్రామాలు స్టార్ట్  చేశాయని అన్నారు.


ముగ్గురూ ఒక్కటే :


నాలుగేళ్ళ పాటు చంద్రబాబు పల్లకీ మోసిన బీజేపీ, జనసేన అధినేత పవన్ కళ్యాన్ కూడా అవినీతికి బాధ్యత వహించాలని లక్ష్మీ పార్వతి అన్నారు. ఆనాడు బాబు అవినీతిపై ఒక్క మాటా అనకుండా ఇపుడు బయటకు వచ్చి మాట్లాడం జనాలను వంచించడమేనన్నారు. బాబు వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే ఇదంతా అన్నారు. 


కరవు కనబడదా బాబూ :


ఏపీలో కరవు పూర్తిగా ఉంటే బాబు మాత్రం సొంత రాజకీయం చేసుకుంటున్నారని లక్ష్మీ పార్వతి అన్నారు. బాబు పాలనలో అన్నింటా అన్యాయమేనని, సామాన్యుల ప్రాణాలకు విలువ లేదని అటాక్ చేశారు. బాబు అండ్ కో చేస్తున్న దారుణాలను జనం గమనించి వచ్చే ఎన్నికలలో గుణపాఠం చెప్పాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: