లోకేష్ నోరు జారడటం కొత్తేమి కాదు అయితే ఇలా ప్రతి సారీ నోరు జారుతుంటే ప్రతి పక్షాలకు ఆయుధంగా లోకేష్ మాటలు ఉపయోగ పడుతాయి. ఇప్పటికే తమ పుత్ర రత్నం కోసం చంద్ర బాబు తెలుగు పంతుల ను కూడా సెట్ అప్ చేసాడు. పొలిటికల్ స్పీచ్ ల కోసం కసరత్తు కూడా చేపించాడు అయినా చిన్న బాబు లో ఎటువంటి మార్పు రావడం లేదు. ప్రతి సారి స్టేజి మీద ఎదో ఒక కామెడీ చేసి ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. 

Image result for lokesh

ఇంతకీ లోకేష్ ఏమన్నాడంటే, జగన్ మోదీ రెడ్డి అని కామెంట్స్ చేసినాడు ఈ కామెంట్స్ కు ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రజలకు అర్ధం కాలేదు. అయితే లోకేష్ ఇలా మాట్లాడి.. ప్రధాని పేరును జగన్ పక్కన తీసుకొచ్చి పెట్టి జగన్ ఇమేజ్‌ను పెంచుతున్నట్టుగా ఉన్నాడు. అలాగే లోకేష్ బాబు శ్రీరంగనీతులు చెబుతున్నాడని కూడా అర్థం అవుతోంది. మొన్నటి వరకూ భారతీయ జనతా పార్టీతో కలిసి కాపురం చేసింది తెలుగుదేశం పార్టీ. నాలుగు సంవత్సరాల పాటు బీజేపీ, టీడీపీలు కలిసిసాగాయి.

Image result for lokesh

ఆ సమయంలో లోకేష్ కూడా ప్రత్యేకహోదా వంటి అంశాల గురించి బ్రహ్మాండంగా మాట్లాడాడు. హోదా కావాలని అంటూ జగన్ జనాలను తప్పుదారి పట్టిస్తున్నాడు అని లోకేష్ బాబు ఆందోళన వ్యక్తంచేశాడు. ఇప్పుడేమో హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది పక్కా మోసకారిలా మాట్లాడుతున్నాడు లోకేష్. ఇక అప్పట్లో మోడీ గురించి లోకేష్ గారి వచనాలు అన్నీ ఇన్నీకావు. తన కొడుకు దేవాన్ష్‌కు మోడీ తాతయ్యను ప్రతి రోజూ పేపర్ లో చూస్తున్నాడని.. పేపర్లో మోడీ ఫొటోను చూసి.. మోడీ తాతయ్య ఇడిగో.. అంటున్నాడని.. లోకేష్ అప్పట్లో మురిపెంగా చెప్పుకున్నాడు. ఇప్పుడేమో లోకేష్ స్వరం మార్చి ఇలా మాట్లాడుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: