తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ఈ రోజు డిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. ఆయనతో చాలాసేపు సమావేశమై అనేక అంశాలు చర్చించారు. ఈ భేటీకి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఓ వైపు మోడీకి మిత్రులే ఝలక్ ఇస్తున్న టైంలో కేసీయార్ అవిశ్వాసం వేళ తన ఎంపీలతో  వాకౌట్ చేయించి అండగా నిలబడ్డారు. అంతేనా ప్రధాని కూడా నిండు లోక్ సభలో కేసీయార్ సూపర్ అంటూ తెగ పొగిడారు. 


రాజకీయమేంటి :


నిజానికి ఓ ప్రధాని, ముఖ్యమంత్రి భేటీకి అంతగా ప్రాధాన్యత ఉండదు. కానీ కేసీయార్, మోడీ మీటింగ్ ను ఇపుడున్న పరిస్థితులలో అలా చూడలేము. అధికారిక భేటీ అయినా రాజకీయాల చర్చకూ అవకాశం ఉంది. పైగా ఓ తెలుగు సీఎం చంద్రబాబు బీజేపీని తిడుతున్న వేళ మరో తెలుగు సీఎం మోడీ పక్కన చేరడాన్ని తక్కువ పాలిటిక్స్ అని కూడా అనలేం. ఇంకోవైపు కేసీయార్ ఉమ్మడి ఏపీ గవర్నర్ నరసింహన్ ను కూడా కలసి చర్చించిన మీదటనే ప్రధానితో భేటీ అవుతున్నారు. దాంతో ఏపీ రాజకీయాలు ఇద్దరి మధ్యన చర్చకు  రావచ్చునంటున్నారు. ఓటుకు నోటు కేసు  కూడా అలాగీ ఉంది. మరి బాబు చూస్తే ఇద్దరికీ చెడ్డ అనిపించుకుంటున్న టైంలో మోడీతో కేసీయార్  క లసి ఏం చేస్తారన్నది కూడా ఆసక్తికరమైన అంశమే.


ఇవీ డిమాండ్లు :


తెలంగాణాలో కొత్త జోన్ల ఏర్పాటు, విభజన హామీలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఇక కేంద్రం నుంచి దండిగా నిధుల విడుదలతో పాటు, ఐఐఎం, ఐపీఐఆర్,కరీం నగర్ ల ట్రిపుల్ ఐటీ, కొత్త జిల్లాలలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు వంటివి ప్రధాని ముందు కేసీయర్ ఉంచిన డిమాండ్లు.  వీటితో పాటు రాబోయే ఎన్నికలు, రాజకీయాలు కూడా ఇద్దరు నాయకులూ చర్చించారని తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో మీటింగులతో బిజీగా ఉన్నా కూడా సీఎం చంద్రబాబు ఈ ఇద్దరు భేటీపై ఓ కన్నేసి ఉంచారని తెలుస్తోంది. అలా చూసుకుంటే ఇది చాలా
కీలకమైన భేటీయే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: