బీజేపీ జాతీయ అధ్యక్షుదు అమిత్ షా సెప్టెంబర్లో విశాఖ టూర్ పెట్టుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలను అలా చుట్టేయాలని ఆయన ప్లాన్. చంధ్రబాబు బీజేపీకి కటీఫ్ కొట్టిన తరువాత అమిత్ షా ఏపీలో పెద్ద ఎత్తున టూర్ చేయడం ఇదే అవుతుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పర్యటించి వెళ్ళారు. ఇపుడు షా కూడా రావడంతో బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది.


ఆ టైంకి అనౌన్స్మెంట్ :


సరిగ్గా  అమిత్ షా విశాఖ టూర్ ఉందనగా రైల్వే  జోన్ అనౌన్స్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. దీనిని పూర్తిగా రాజకీయంగా అనుకూలంగా మలచుకోవడంతో పాటు, భారీగా మైలేజ్ పొందాలని బీజేపీ పక్కాగ స్కెచ్ వేస్తోంది. ఉత్తరాంధ్ర టూర్లో రైల్వే జోన్ అంశం ప్రధానంగా ప్రచారం చేసుకోవడం, విశాఖలో  పెద్ద మీటింగ్ పెట్టి మరీ ఆ క్రెడిట్  తమ ఖాతాలో వేసుకోవడం బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది.


టీడీపీకి చెక్ పెట్టేలా :


ఏపీలో అధికార టీడీపీకి చెక్  పెట్టేలా  అమిత్ షా టూర్ ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అధికార పార్టీ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడం, పొత్తుల ఎత్తులకు తెర తీయడం వంటివి అమిత్ షా అజెండాగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఆగస్ట్ 10 నుంచి మూడు రోజుల పాటు విశాఖలోనే ఆరెస్సెస్ మీటింగులు అఖిల భారత  స్థాయిలో జరగబోతున్నాయి.

ఈ మీటింగులలో వచ్చిన సూచనలకు అనుగుణంగానే అమిత్ షా ఏపీ టూర్, విశాఖ  పర్యటన ఖరారు చెస్తున్నారు. టోటల్ గా  చూసుకుంటే బీజేపీ చాణక్యుడు అమిత్ షా ఫీల్డ్ లోకి డైరెక్ట్   గా దిగి బాబును అటాక్ చేస్తారని కాషాయం పార్టీ నేతలు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: