తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పై దారుణమైన కామెంట్స్ చేశారు. పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే ఎల్లో మీడియా పై నిప్పులు కురిపించారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు చేయని పనులను కూడా చేసినట్లు ఎల్లో మీడియా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Related image

గడిచిన నాలుగు సంవత్సరాలలో చంద్రబాబు చేసినది చూస్తే ఏమీ లేదని విమర్శించారు జగన్. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా పాలనను గమనిస్తే ఉన్నదంతా పక్క దారి పట్టించే ప్రయత్నం తప్ప మరోకటి లేదు. ప్రకటనలు, ఎల్లోమీడియా సమస్యల నుంచి ప్రజలను పక్క దోవ పట్టించేందుకే ఆరాటం కనిపిస్తోంది.

Related image

ప్రజలను దగ్గరుండి మోసం చేస్తారు. ఎన్నికలు ఆరునెలల్లో ఉన్నందున, ఎదుటి వారిని మోసం చేసేవారంటూ బాకా ఊదుతారు. చంద్రబాబు అబద్దాలు, ఆడినా, మోసం చేసినా వీరికి కనిపించదు. ఆ పేపర్లు, ఆ టీవీల్లో కనిపించేదేమిటంటే.. చంద్రబాబు ఆహా ఇంద్రుడు, చంద్రుడు అయ్యా, ఆహా రైతులు, డ్వాక్రా మహిళలు కేరింతలు, కొడుతున్నట్లు, పిల్లలకు ఉద్యోగాలు వచ్చి డబ్బులు వచ్చి వాటిని ఎలా ఖర్చు చేయాలో తెలియకుండా ఉన్నారు అన్నట్లుగా చెపుతారు" అని ఎల్లో మీడియా ఛానల్స్ పై మండిపడ్డారు జగన్.

Related image

రాష్ట్రం అభివృద్ధి అవ్వాలన్నా ….పిల్లలకు ఉద్యోగం రావాలన్న వచ్చే ఎన్నికల్లో ప్రజలు చిత్తశుద్ధితో మనస్సాక్షి ప్రకారం ఓటు వేస్తేనే….రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవేళ దేవుడి దయవల్ల..ప్రజల ఆశీర్వాదం వల్ల వైసీపీ అధికారంలోకి వస్తే సత్యాన్ని పక్కదోవ పట్టించే...రాతలను..ఆయా ఛానల్స్ పై  సరైన రీతిలో గుణపాఠం ఉంటుందని జగన్ వైసీపీ నేతలతో అన్నారట.




మరింత సమాచారం తెలుసుకోండి: