తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు  మహానగరంలో అంగరంగవైభవం జరిగాయి. బోనాల శోభతో జంటనగరాలు కళకళలాడుతున్నాయి.  భక్తుల కోలాహలం మధ్య అమ్మవారికి బోనం సమర్పించారు. ప్రధానం పాతబస్తీలో పేరుగాంచిన లాల్‌దర్వాజ మహంకాళి బోనాలు, దర్బార్‌మైసమ్మ, అక్కన్న,మాదన్న దేవాలయం, బోరబండ మహంకాళి, ఎల్బీనగర్‌ కిల్లామైసమ్మ దేవాలయాలు జనసందోహంగా మారాయి.
Image result for telangana bonalu
మొక్కులు సమర్పించేందుకు రాజకీయ ప్రముఖులు అనుచరులతో హంగామా చేసి డప్పు వాయిద్యాల నడుము చిందులేశారు.. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్‌ తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని మంత్రి తలసాని తెలిపారు. రేపు ఊరేగింపు కోసం ఘనంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
Image result for telangana bonalu
హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్‌, తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు కోదండరామ్‌, మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించి.. మొక్కులు చెల్లించారు.
Image result for telangana bonalu
తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఫలాలు అందరికీ అందాలని అమ్మను వేడుకున్నట్టు ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. . బోనం ఎత్తుకుని..అమ్మను దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం.



మరింత సమాచారం తెలుసుకోండి: