పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత పూర్తి గా సినిమా లను పక్కన పెట్టేసాడు. అయితే పవన్ కళ్యాణ్ కు అశేష అభిమానులు ఉన్నారన్న సంగతీ తెలిసిందే. అయితే అతని అభిమానులు చేసే 'అతి' ఇప్పుడు పవన్ రాజకీయ భవిష్యత్ కు హానీ చేయనున్నది.  తమ హీరో రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అభిమానులు ఎలా ప్రవర్తించాలో వారికి తెలియడం లేదు. 

Image result for pavan janasena

కర్నూలు జిల్లాలో ఇటీవల ఓ క్వారీలో పేలుళ్ళు సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోగా, తీవ్రగాయాలతో కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలాన్ని జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌ ఈ రోజు సందర్శించారు. ఈ క్రమంలో అభిమానుల హంగామా పవన్‌కళ్యాణ్‌కే చిరాకు తెప్పించేసింది. పవన్‌ కళ్యాణ్‌ పరిస్థితే అలావుంటే, చూసే జనం పరిస్థితేంటి.! 

Image result for pavan janasena

పవన్‌కళ్యాణ్‌ వెళ్ళింది పెళ్ళికి కాదు.. ఇంకేదో ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కి వెళ్ళారా.. అంటే అదీకాదు. పరామర్శకు పవన్‌ వెళ్ళినప్పుడు, అభిమానులు ఎంత 'కంట్రోల్‌'లో వుండాలి.! ఇంకా నయ్యం.. అలా కంట్రోల్‌లో వుంటే, వాళ్ళు పవన్‌కళ్యాణ్‌ అభిమానులు ఎందుకవుతారు.? ఈ సినీ అభిమానులతో వచ్చిన చిక్కే అది. పర్యటనల్ని అర్ధాంతరంగా ముగించేసుకోవడం ఈ మధ్యకాలంలో పవన్‌కి షరామామూలయిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: