ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకీ పుంజుకుంటుంది. తాజాగా ఇటీవల అధినేత చంద్రబాబు నిరుద్యోగ భృతి అలాగే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించడంతో రాష్ట్రంలో ఉన్న యువత తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతోంది. దీంతో చంద్రబాబు మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించిన నేపద్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రత్యర్థి పార్టీ రాజకీయ నాయకులకు ఎన్నికల ఓటమి మొదలైనట్లు అర్థమవుతుంది సారీ వ్యవహరిస్తున్న తీరును బట్టి. ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలలో టిడిపి పార్టీ జోరు వన్ సైడ్ వార్ గా దూసుకుపోతోంది.

Image result for chandrababu

తూర్పు నగరంగా పిలవబడుతున్న విశాఖలో...తూర్పు అసెంబ్లీ స్థానంలో  వరుసగా రెండుసార్లు విజయంతో టీడీపీ ఈ నియోజకవర్గంపై పట్టు నిలుపుకుంటోంది. 2009, 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలిచిన వెలగపూడి రామకృష్ణ బాబు వాస్తవానికి కృష్ణాజిల్లా నివాసి. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఇతనిపై వంగవీటి మోహన్ రంగా హత్యకేసు కూడా ఉంది. ఆ కేసు నేపధ్యంలోనే విశాఖకు వలస వచ్చారని చెబుతారు.

Related image

మద్యం వ్యాపారంతో ఇక్కడ ఆర్ధికంగా నిలదొక్కుకున్న వెలగపూడి 2009లో తొలిసారి టీడీపీ టికెట్ పై విజయం సాధించారు. అనంతరం 2014లో ఏకంగా 47 వేల మెజార్టీతో గెలిచి నియోజకవర్గంపై పట్టుందని నిరూపించుకున్నారు. ఈసారి కూడా కచ్చితంగా ఇతనికే టికెట్ దక్కుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Image result for velagapudi ramakrishna

ఎప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తిగా పేరు సంపాదించుకున్నా రామకృష్ణ బాబు రాబోయే ఎన్నికలలో కూడా విజయం సాధిస్తారని ఆ ప్రాంత ప్రజలే అంటున్నారు. మరోపక్క ప్రతిపక్ష పార్టీ వైసీపీకి ఈ ప్రాంతంలో ఉన్న అభ్యర్థి పై లేనిపోని అవినీతి ఆరోపణలు కూడా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి  రామకృష్ణ బాబుకి భీభత్సమైన మెజార్టీ రావడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: