ఢిల్లీ కేంద్రంగా  జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే అవున‌నే అనిపిస్తోంది. ఈమ‌ధ్య‌నే  ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడి తీసుకున్న రెండు నిర్ణ‌యాలు కూడా ఆ విష‌యాన్నే  నిర్ధార‌ణ చేస్తోంది. బిసి క‌మీష‌న్ కు రాజ్యాంగ హోదా ఇవ్వ‌టం,  బిసి వ‌ర్గీక‌ర‌ణ‌కు మొగ్గు చూప‌టం చాలా కీల‌క  నిర్ణ‌యాలనే చెప్పాలి.  పై రెండు నిర్ణ‌యాలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిసి ఓట్ల‌ను ఆక‌ర్షించేందుకు బిజెపికి ఉప‌యోగ‌ప‌డే అవ‌కాశాలున్నాయి. 


రెండు సామాజిక‌వ‌ర్గాలే కీల‌క‌మా ?


దేశ‌వ్యాప్తంగా బిసి సామాజిక‌వ‌ర్గాల‌ను ఆక‌ర్షించటం,  ఓట్లు వేయించుకోవ‌టం సంగ‌తి ఎలాగున్నా  ఏపి రాజ‌కీయాల్లో మాత్రం ప్ర‌భావం ఎక్కువ‌గా ప‌డే అవ‌కాశాలున్న‌ట్లే క‌న‌బ‌డుతోంది. ఎందుకంటే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక‌వైపు కాపులు మ‌రోవైపు బిసిలు పార్టీల గెలుపోట‌ముల‌ను ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.  ఇత‌ర పార్టీల సంగ‌తెలాగున్నా తెలుగుదేశంపార్టీపై ప‌డే ప్ర‌భావం చాలా ఎక్కువ‌నే చెప్పాలి. 


టిడిపిని వ‌దిలిపెట్ట‌ని బిసిలు


టిడిపి పెట్టిన ద‌గ్గ‌ర నుండి బిసి సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌పైనే ప్ర‌ధానంగా ఆధార‌ప‌డుంది.   పార్టీ పెట్టిన త‌ర్వాత వివిధ సంద‌ర్భాల్లో కొన్ని సామాజిక‌వ‌ర్గాలు టిడిపికి మ‌ద్ద‌తివ్వ‌టం, వ‌దిలేయ‌టం జ‌రిగాయి.  కానీ ఏ ఎన్నిక‌లో కూడా బిసి సామాజిక‌వ‌ర్గం మాత్రం టిడిపిని వ‌ద‌ల‌కుండా అంటిపెట్టుకునే ఉండేది.  ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే  వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపికి బిసి ఓట్ల నుండి గండిప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌న‌బ‌డుతోంది. 


హామీతోనే చంద్ర‌బాబుపై మండుతున్న బిసిలు

Image result for bc agitation

నిజంగానే బిసిలు గ‌నుక టిడిపికి దూర‌మైతే అది చంద్ర‌బాబునాయుడు స్వ‌యంకృత‌మ‌నే చెప్పాలి. పోయిన ఎన్నిక‌ల్లో  కాపుల‌ను బిసి రిజ‌ర్వేష‌న్ల‌లో క‌లుపుతామంటూ చంద్ర‌బాబు హామీ ఇచ్చిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.  కాపుల‌ను బిసిల్లో క‌ల‌ప‌టాన్ని బిసి నేత‌లు మండిప‌డుతున్నారు. అప్ప‌టి నుండి ప‌లువురు నేత‌లు టిడిపికి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారు. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపికి బిసి సామాజిక‌వ‌ర్గం నుండి గుండుగుత్త‌గా మ‌ద్ద‌తు ల‌భించేది అనుమాన‌మే.


బిసి ఓట్ల‌లో చీల‌క త‌ప్ప‌దా ?

Image result for bc tdp leaders

అదే స‌మ‌యంలో  బిసి ఓట్ల‌పై ఒక‌వైపు వైసిపి మ‌రోవైపు తాజాగా బిజెపిలు క‌న్నేశాయి. బిసి క‌మీష‌న్ కు రాజ్యంగ హోదా క‌ల్పించటం, బిసి వ‌ర్గీక‌ర‌ణ చేయాల‌న్న‌నిర్ణ‌యం చాలా కీల‌క‌మ‌నే చెప్పాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నరేంద్ర‌మోడి ప్ర‌ధాని అయితేనే పై రెండు నిర్ణ‌యాలు  పూర్తిగా అమ‌ల‌వుతాయనే చ‌ర్చ మొద‌లైంది.  సామాజిక‌వ‌ర్గంలో జ‌రుగుతున్న డిస్క‌ష‌న్ చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపికి కూడా బిసి ఓట్లు ప‌డే అవ‌కాశాల‌ను కొట్టేసేందుకు లేదు. ఏపిలో బిజెపి ఎన్నిసీట్ల‌లో గెలుస్తుంద‌న్న విష‌యాల‌ను ప‌క్క‌న‌పెడితే  మోడిని బ‌లోపేతం చేయ‌టానికి బిసిలు ఓట్లేసే అవ‌కాశాలైతే ఉన్నాయి. సో, ఎలా చూసుకున్నా ఇప్ప‌టి వ‌ర‌కూ టిడిపికి  మాత్ర‌మే ప‌డుతున్న బిసిల ఓట్లలో చీల‌క వ‌చ్చే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌న‌బడుతోంది. అంటే ఆ మేర‌కు చంద్ర‌బాబుకు షాకు త‌ప్ప‌ద‌నే అనుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: