వైఎస్ జగన్, ఏపీ రాజకీయాలలో ఇపుడు కీలకమైన నాయకుడు. వెంట్రుక వాసిలో అధికారం పోయిన ఎన్నికలలో చేజారింది కానీ జగన్ చరిష్మా  మాత్రం ఎక్కడా తగ్గలేదు అయనతో ముడిపడే ఏపీ రాజకీయాలు గత పదేళ్ళుగా  సాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న పాదయాత్రకు కూడా జనం పోటెత్తుతున్నారు. ఎక్కడకు వెళ్ళినా బ్రహ్మరధం పడుతున్నారు. జగన్ ఫాలోయింగ్ ఏపీలో మరో నాయకుడికి లేనే లేదన్న విషయాన్ని ప్రత్యర్ధులు సైతం అంగీకరిస్తారు.


ఆయన అవినీతిపరుడట :


జగన్ గురించి పదేళ్ళుగా జనాలకు తెలిసింది కూడా రాజకీయ నాయకులకు తెలియదా లేదా లేక  వారు తమకు తాముగా ఏర్పాటు చేసుకున్న రంగుటద్దాలలోనే లోకాన్ని చూస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతూంటాయి. జగన్ అవినీతిపరుడు అన్నారు సీనియర్ సీపీఎం నాయకుడు బీవీ రాఘవులు. లేటేస్ట్ గా ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరెందుకు జగన్ పార్టీతో పొత్తు పెట్టుకోరు  అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబు ఇది.

నిజానికి జగన్ పై కేసులు కోర్టులలో నడుస్తున్నాయి. ఆయన అవినీతి చేశాడా లేడా అన్నది ప్రూవ్ కావాల్సిఉంది. మరి అన్నీ తెలిసిన రాఘవులు ఇలా అనేయడమే వింత. ఏపీలో టీడీపీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామంటున్న వామపక్షాలకు బాబుని డైరెక్ట్  గా డీ కొడుతున్న జగన్ తో కలిసేందుకు ఏం అభ్యంతరాలు ఉన్నాయో వారికే తెలియాలి కానీ, కోర్టులలో ఉన్న కేసులను చూసి నింద వేయడమే భాధాకరమంటున్నారు జనం.


జగన్ నేరస్థుడు కాడు :



ఈ మాటలు అన్నది న్యాయవాది, రాజకీయాలలో సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. జగన్ పై ఒక్క కేసు కూడా రుజువు కాదని, ఆయన అవినీతి చేసినట్లుగా ప్రూవ్స్ కూడా లేవని ఉండవల్లి చెబుతున్నారు. జగన్ జైల్ కి పోతాడంటూ తెల్లారి లేస్తే టీడీపీ నాయకులు చెస్తున్న విమర్శలను ఆయన కొట్టి పారేశారు. జగన్ జైల్ కి వెళ్ళాల్సినంత పెద్ద కేసులేవీ లేవనీ తేల్చేశారు. జగన్ ప్రస్తుతం ముద్దాయి మాత్రమే తప్ప నేరస్తుడు కానే కాదన్నారు.



ఒకవేళ క్విడ్ ప్రోకో అన్నది జరిగింది అంటే ఆ నేరం నాటి కాంగ్రెస్ ప్రభుత్వానిదే తప్ప జగన్ కి ఏమీ సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. ఇలా ఇద్దరు నాయకులు ఒకే టైంలో జగన్ గురించి వేరు వేరు చానళ్ళలో చెప్పిన మాటలివి. అసలు ఇంతకీ జగన్ ఎవరు, ఏంటన్నది వచ్చే ఎన్నికలలో జనం తీర్పు చెబుతారు. జగన్ కి వస్తున్న జనాదరణ దానికి సంకేతంగా కళ్ళ ముందే ప్రస్తుతం కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: