సాధార‌ణ ఎన్నిక‌లకు ముందే అటు అధికార బీజేపీ, ఇటు బీజేపీ వ్య‌తిరేక కూట‌మికి మ‌రో కీల‌క ప‌రీక్ష ఎదుర‌వుతోంది. రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక రూపంలో ఈ ప‌రీక్ష ఎదుర‌వుతోంది. ఎలాగైనా డిప్యూటీ చైర్మ‌న్ ప‌ద‌విని ద‌క్కించుకోవాల‌ని బీజేపీ, ఈ అవ‌కాశాన్ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ క‌మ‌ల‌ద‌ళానికి ఇవ్వొద్ద‌న్న ప‌ట్టుద‌ల‌తో కాంగ్రెస్‌, త‌దిత‌ర విప‌క్షాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌పై ప‌డుతుంద‌ని ఇరువ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయి. అయితే 245 మంది స‌భ్యులు ఉన్న రాజ్య‌స‌భ‌లో 122మంది స‌భ్యుల మ‌ద్ద‌తు ఉంటేనే డిప్యూటీ చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కుతుంది. 


ఈ మ్యాజిక్ ఫిగ‌ర్‌ను అందుకోవ‌డానికి బీజేపీ ఏం చేస్తుంద‌న్న‌ది అంద‌రిలో ఆస‌క్తినిరేపుతోంది. మ‌రోవైపు స‌రైన బ‌లం లేదు కాబ‌ట్టి పోటీకి దూరంగా ఉన్నా ఆశ్చ‌ర్య‌మేమీ లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఈ విష‌యంలో చాలా రోజులుగా హ‌డావుడి జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నగారా మోగడంతో పార్టీల‌న్నీ అల‌ర్ట్ అయ్యాయి. వర్షాకాల సమావేశాల్లోపే రాజ్యసభ‌కు డిప్యూటీ చైర్మన్‌ను నియమించాలని చైర్మన్ వెంకయ్య నాయుడు నిర్ణయించారు. 

Image result for venkaiah naidu

ఈమేర‌కు ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మ‌న్‌ ఎన్నికను నిర్వహించనున్నట్లు ఆయ‌న ప్రకటించారు. ఈనెల‌ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ నామినేషన్ల‌కు గ‌డువు ఉంది. పీజే కురియన్ పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నిక‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే ఖాళీ అయిన డిప్యూటీ చైర్మన్ స్థానాన్ని పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అయితే, ఇటీవ‌ల కేంద్రంపై టీడీపీ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా ఓటింగ్‌కు టీఆర్ఎస్‌, బీజేడీలు దూరంగా ఉన్నాయి. 


అయితే ఈ ఎన్నిక‌ల్లో అటు బీజేపీకి, ఇటు విప‌క్ష కూట‌మికి త‌ట‌స్థంగా ఉన్న టీఆర్ఎస్‌, బీజేడీ, వైసీపీల నిర్ణ‌యం కీల‌కం కానుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, న‌వీన్‌ప‌ట్నాయ‌క్‌, జ‌గ‌న్‌లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటున్నార‌న్న‌ది ఇప్పుడు ఇరు కూట‌ముల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ పార్టీల‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుల ఓట్లు కీల‌కం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ నుంచి ఎవ‌రు బ‌రిలోకి దిగుతారు..?  కాంగ్రెస్ నేతృత్వంలోని కూట‌మి నుంచి ఎవ‌రు పోటీ చేస్తార‌న్న విష‌యంలో ఇప్ప‌టికైతే క్లారిటీ లేదు. అయితే, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ విప‌క్ష కూట‌మి త‌రుపున‌ త‌`ణ‌మూల్ అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఇందుకు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటుందా..?  లేదా అన్న‌ది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: