వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశంపార్టీ ఒంట‌రిగా పోటీ చేసే ధైర్యం చేస్తుందా ?  జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే ఛాన్సే లేద‌ని చెప్ప‌వ‌చ్చు. ఏదో ఒక పార్టీ అండ లేకుండా చంద్ర‌బాబునాయుడు ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనే ధైర్యం చేసే అవ‌కాశ‌మే లేదు.  ఒకే ఒక్క‌సారి అది కూడా 2003 ఎన్నిక‌ల్లో టిడిపి ఒంటిరిగా పోటీ చేసి ఓడిపోయింది. అప్ప‌టి నుండి ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే చంద్ర‌బాబుకు చ‌మ‌ట‌లు ప‌ట్టేస్తుంది. అందుక‌నే ఏదో ఒక విధంగా ఏదో పార్టీతో పొత్త‌లు కంప‌ల్స‌రీ. 


కాల్వ మాట‌ల‌కు అర్ధాలేంటి ?


ఇదంతా ఎందుకంటే ?  స‌మాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి ఒంట‌రిగానే పోటీ చేస్తుంద‌నే అర్దం వ‌చ్చేట్లు మాట్లాడారు. పోయిన ఎన్నిక‌ల్లో బిజెపితో పొత్తులు పెట్టుకోవ‌టం వ‌ల్లే టిడిపికి కొన్ని సీట్లు త‌గ్గాయ‌ని కూడా మంత్రి చెప్పారు. కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసి పోయిన ఎన్నిక‌ల్లో వ‌చ్చిన సీట్ల‌క‌న్నా ఎక్కువ తెచ్చుకుంటామంటూ స‌వాలు కూడా విసిరారు లేండి. అస‌లు త‌మ‌తో పోటీ ప‌డే పార్టీనే ఏపిలో లేద‌ని కూడా కాల్వ ధీమా వ్య‌క్తం చేయ‌టం ఆశ్చ‌ర్యంగా ఉంది. మొత్తం మీద కాల్వ మాట‌లు చూస్తుంటే కాస్త ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తున్న‌ట్లే ఉంది.


ఒంట‌రి పోటీ అంటే ఫోబియా

Image result for tdp left and trs parties

ఎన్టీఆర్ ను  వెన్నుపోటు పొడిచి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని లాక్కున్న ద‌గ్గ‌ర నుండి చంద్ర‌బాబుకు ఒక విధ‌మైన ఫోబియా ప‌ట్టుకుంది. ఎందుకంటే, సొంతంగా పోటీ చేసి ఓట‌ర్ల‌ను మెప్పించి తెచ్చుకున్న ప‌ద‌వి కాదు క‌దా ? అందుకే ఓట‌ర్లు త‌న నాయ‌కత్వాన్ని ఆధ‌రిస్తారో లేదో అన్న అనుమానం ఇప్ప‌టికీ  ప‌ట్టి పీడిస్తూనే ఉంది. ఒక‌వైపు అనుమానం, మ‌రోవైపు స‌త్తా చూపాల‌న్న ఆరాటం. దాంతో 2004 లో ధైర్యం చేసి ఒంట‌రిగానే పోటీ చేశారు. ఇంకేముంది,  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ దెబ్బ‌కు కుదేలైపోయారు. 


చంద్ర‌బాబుకు పొత్తులే దిక్కు

Image result for tdp left and trs parties

దాంతో ఆ దెబ్బ‌కు మ‌ళ్ళీ ఒంట‌రి పోటీకి సాహ‌సం చేయ‌లేదు. అందుక‌నే 2009లో టిఆర్ఎస్, వామ‌ప‌క్షాల‌ను క‌లుపుకుని వెళ్ళినా  ఓడిపోయారు. దాంతో ఎప్పుడో దూరం పెట్టేసిన బిజెపితోనే జ‌ట్టు క‌ట్టాల్సి వ‌చ్చింది.  2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో  బిజెపి, జ‌న‌సేన తో పొత్తు వ‌ల్లే  లాభ‌ప‌డ్డారు. లేక‌పోతు ముఖ్య‌మంత్రి అయ్యే ఛాన్సే లేద‌న్న‌ది వాస్త‌వం. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని టిడిపి ఎన్నిక‌ల చ‌రిత్ర ఇలావుంటే ఇపుడు కాల్వేమో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోటీ అంటూ స‌వాలు విసురుతున్నారు. కాల్వ స‌వాలు గ‌నుక నిజ‌మే అయితే చంద్ర‌బాబు మ‌ళ్ళీ ప్ర‌తిప‌క్షంలో కూర్చోక త‌ప్ప‌దేమో ?     



మరింత సమాచారం తెలుసుకోండి: