స్వాతంత్ర సంగ్రామం అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప స్వతంత్ర పోరాటం మన దేశం సొంత. మూడొందల  సంవత్సరాల పాటు తెల్ల దొరలు మన నెత్తిన కూర్చుని పాలిస్తూ ఉంటె ఇది కాదు రా బతుకు అంటే అని ఉద్యమం లాగా లేవనెత్తిన గొప్ప సంగ్రామం లో దేశాన్ని తమ కంబంధ హస్తాల్లో బంధించిన తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన మన్యం వీరుడు అల్లూరి నుంచి సాయుధ సంగ్రామానికి సైన్యం ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ వరకు స్వాతంత్రం కోసం ప్రాణార్పణ చేసినవారే.
Image result for independence day
కానీ వారందరి ప్రాణార్పణ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించలేక పోయినా ప్రతి భారతీయుని స్వాతంత్ర సంపాధన కాంక్ష ఎగసి పడేలా చేశాయి. ప్రపంచం మొత్తం కూడా నివ్వెర పోయేలా 'శాంతి' అనే ఒకే ఒక్క అజెండా తో అందరికీ ఆదర్శం గా నిలిచిన అతిగొప్ప సంస్కారం మన సొంతం .. విద్వేషాలు - గొడవలు లేకుండా శాంతియుతంగా స్వతంత్రం సాధించుకున్న గొప్ప దేశం మనది.
Image result for independence day
అందుకే ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ అయ్యేలా చెయ్యడం మన సొంతం. అలా ఆనాడు అంతమంది ఎన్నో కష్ట నష్టాలకోర్చి స్వాతంత్రాన్ని సంపాదించారు కాబట్టే భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర మహోన్నత అధ్యాయంగా నేటికీ అందరి చేతా కొనియాడబడుతోంది. అంతటి గొప్ప చరిత్రతో సాదించుకు దేశ స్వాతంత్రం గురించి, స్వాతంత్రమనే నిధి సాకారమైన ఆగస్టు 15 రోజు గురించి తల్చుకుంటే భారతీయుడైన ప్రతి ఒక్కరికీ మనసులో ఉద్వేగం ఉప్పొంగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: