మోహందాస్ కరంచంద్ గాంధీ అంటే ఎవరికీ తెలియదు. మహాత్మా గాంధీ అంటే  అందరికీ  తెలుస్తుంది. ఓ మామూలు మనిషి మహాత్ముడు ఎలా అయ్యాడు, గాంధీ నిండు జీవితం చదివితే అర్ధం అవుతుంది. అందరిలాగేనే గాంధీ పెరిగాడు. ఆయన పుట్టింది గుజరాత్ రాష్ట్రం పోరుబందర్ 1869 అక్టోబర్ 2. గాంధీ చదువుల కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళేంత వరకూ ఆయనకు దేశ స్వాతంత్రం గురించిన ఆలోచనలు పెద్దగా లేవు. అక్కడ జాతి వివక్షత దెబ్బ చవి  చూసిన యువ గాంధీ వెంటనే తన దేశం గురించి ఆలొచన చేశాడు. అంతే ఆయన చూపు భారత్ వైపు మళ్ళింది. 


అప్పటికే ముమ్మర పోరాటం :


 :
అప్పటికే ఎందరో ఈ దేశం కోసం అసువులు బాసారు. మరెందరో పోరాడుతున్నారు. గాంధీ వారితో కలిసాడు. మొదట అనుసరించాడు. తరువాత గాంధీయే మార్గ దర్శకుడైనాడు.  గాంధీలో సహనం, ఓర్పు, పట్టుదల వంటివి ఇతర నాయకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆయన బాటలో నడిస్తే స్వాతంత్రం వస్తుందని అంతా బలంగా నమ్మారు. జై మహాత్మా అంటూ వెంట వచ్చారు.


సత్యాగ్రాహి :


తలపెట్టిన సంకల్పన్ నెరవేరాలంటే సత్యాగ్రహమే శరణ్యమని భావించాడు గాంధి. తనను తాను బలవంతునిగా చేసుకుంటూ ఎదుటి శత్రువుని బలహీనున్ని చేశాడు. కొట్టడం, తిట్టడం కాదు, తన ధర్మమే ఆయుధంగా చేసుకున్నాడు. న్యాయమే ఆలంబనగా మార్చుకున్నాడు. ఉప్పు సత్యాగ్రహంతో తెల్ల వారికి ముప్పు తీసుకువచ్చాదు. క్విట్ ఇండియా అంటూ మర్యాదగానే దారి చూపించాడు.


తాను చేసి చెప్పేవాడు :


గాంధీ ఏది చెప్పినా అది తాను చేసి ఇతరులకు చూపేవాడు. తాను చేయని పనులను, నీతులను ఎపుడూ చెప్పేవాడు కాదు. అందుకే ఆయన మహాత్ముడు అయ్యాడు. తన దేశాన్ని బ్రిటిష్ వారు అప్పనంగా స్వాధీనం చేసుకుని ఏలుతున్నా గాంధీ వారితో సౌమ్యంగానే మాట్లాడేవారు. ఎందుకు స్వాతంత్రం ఈ దేశానికి కావాలో విడమరచి చెప్పేవారు. బ్రిటిష్ వారు సైతం ఆయనను గౌరవించే స్థాయికి ఎదిగారు. 


ఓ విధంగా గాంధీ చారిత్రక పురుషుడు అని చెప్పాలి. ఆయన లేకుంటే ఈ దేశానికి ఎపుడో ఒకపుడు స్వాతంత్రం వచ్చేదేమో కానీ సౌశీల్యం మాత్రం అంతగా అబ్బేది కాదేమో. అందుకే ఆయన పుట్టిన ఈ దేశం ప్రపంచానికే మార్గం చూపింది. తన జీవితమే సందేశమని చెప్పకనే చెప్పిన వాడు గాంధీ


మరింత సమాచారం తెలుసుకోండి: