జయజయ భారత జనయిత్రీ దివ్యధాత్రి అంటూ 127 కోట్ల ప్రజావాహిని తాము స్వాతంత్ర స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న చారిత్రిక దినం ఆగస్టు 15ను గుర్తుకు చేసుకుంటూ మనకు స్వేచ్ఛను ప్రసాదించడానికి తమ సర్వస్వం కోల్పోయి మనకు స్వాతంత్ర వెలుగులు ప్రసాదించిన మన స్వాతంత్ర్యసమరయోధుల త్యాగాలను గుర్తుకు చేసుకుంటూ అనేక మతాలతో కులాలతో సంస్కృతులతో భినత్వంలో ఏకత్వంగా ఎగిరి పడుతున్న మన మువ్వన్నెల జండా .

Image result for దేశంలో పేదరికం

దేశానికీ స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచిపోయినా దేశంలో పేదరికం, అవినీతి, నిరక్షరాస్యత, నేరాలు పెరిగిపోవడం చూస్తూ ఉంటే మనం ఇన్ని దశాబ్దాలు గడిచినా మనం సాధించింది ఇంతేనా అని అనిపిస్తుంది.   సామాన్యుడు ఉంటే, ఓట్లకోసం ప్రజలను వర్గాలుగా విభజించి జనాకర్షణ పధకాలతో మన ఆర్ధిక వ్యవస్థను తూట్లు పొడుస్తున్నా, ఎమీచేయలేని నిస్సహాయస్థితిలో సామాన్యుడు ఉంటే మన నేతల దృష్టిలో కేవలం ఓట్లకు మాత్రమే పనికి వచ్చే ముడి వస్తువుగా కనిపిస్తున్నాడు. ఒక నాడు బ్రిటీష్ వారికి మాత్రమే బానిసలైన మన అఖండ భారత జాతి నేడు దుర్మార్గ రాజకీయాలు, కుంబకోణాలు, ధరల పెరుగుదల, అత్యాచారాలు, మత కలహాలకు బానిసలుగా నేడు మనమంతా మారిపోయాము అనుకుంటే అతిశయోక్తికాదేమో.

Image result for independence day

నేడు మనం జరుపుకుంటున్న ఈ స్వాతంత్రదినోత్సవ సాక్షిగా భారత దేశం యావత్తూ ప్రాంతీయవాదం ఊపందుకుంది. తెలంగాణ, విదర్భ, గయ, గూర్ఖాలేండ్ ఇలా ఎన్నో ముక్కలుగా విడిపోవడానికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, భారత జాతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏనాయకుడికి పదవి కావాలి అనుకుంటే, దేశంలో అక్కడ ఒక విభజన ఉద్యమం తయారవుతోంది. ఆ ఉద్యమాలను తమ అధికారానికి నిచ్చనలుగా ఎలా మార్చుకోవాలి అని మన నాయకులు ఆలోచిస్తున్నారు. ప్రతి రాజకీయ నాయకుడి దగ్గరా లెక్క లేనంత నల్ల ధనం పెరిగి పోవడంతో దేశంలో ఎన్నికలు నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకునే వస్తువుగా మారిపోయాయి. పార్లమెంటులోకన్నా టి.వి లలో ట్విటర్ లో చర్చలు రసవత్తరంగా జరుగుతున్న విచిత్ర రాజకీయ వ్యవస్థలో మనం బతుకుతన్నాం.

Image result for భారతావనిని
ఇన్ని అవాంతరాలు నిరాశాజనక పరిస్థుతుల మధ్య దేశం రావణాకాష్టం లా రగిలిపోతున్నా, రెపరెపలాడుతున్న మువ్వన్నెల జండాను చూస్తే చాలు అన్నీ మర్చిపోతాం. ఎదో అనుభూతి మరేదో చైతన్యం వీటన్నింటిని మించి హృదయం నిండా నిండిపోయిన దేశం పై ప్రేమతో మన జాతీయ జండాను చూడగానే పులకరించిపోతాం, పరవశించిపోతాం అదే భారతీయతలోని గొప్పతనం. ప్రపంచంలో ఏ దేశానికీ లేని విలువైన మానవ సంపద మన సొంతం. ఈ సంపదను చైతన్యపూరితంగా దశా నిర్దేశకత్వం చేసి ప్రపంచ పటాన మన భారతీయ శక్తికి కీర్తి తీసుకొచ్చేలా ఎవరో ఒక నాయకుడు ఈ దేశానికి నాయకత్వం వహిస్తాడని కోట్లాది జనహృదయాల ఆశలకు అనుగుణంగా మన భారతావనిని తీర్చిదిద్దే మహాత్ముడు లాంటి మహనీయుడు కోసం వేచి ఉండే ఓర్పును అనుగ్రహించమని ఈరోజు ఉదయించిన స్వాతంత్ర ఉషోదయ కిరణాల సాక్షిగా మన అమ్మ భారతమాతను మనసారా కోరుకుందాం. మేరా భారత్ మహాన్...

మరింత సమాచారం తెలుసుకోండి: