ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. కాగా,  డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు.  కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్లా ఆమోదింపబడుతున్నది.

Image result for jhansi rani

 కాకపోతే దానికి గల ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె తరుపు గుమస్తా ఆయనకు రాణీ 26 ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే ,భాగీరథీబాయి. పేరు మణికర్ణిక కాగా ఆమె ను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. ఆమె తల్లి రాణి నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. ఆమెకు కత్తిసాము, గుర్రపుస్వారీ,తుపాకీ పేల్చడం వండి విద్యలంటే మక్కువ ఎక్కువ. 


ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ దూసుకుపోయేది.లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. 1851లో లక్ష్మీబాయి ఒక కుమారునికి జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు.  

Image result for jhansi rani

 1857లో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవ కారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్చంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇవ్వనారంభించింది.  సెప్టెంబర్ మరియు అక్టోబర్ 1857 లో ఆమె ప్రక్క రాజ్యాలైన దతియా మరియు ఓర్చా రాజ్యాల నుంచి దాడిని విజయవంతంగా ఎదుర్కొనగలిగింది.  రాణి లక్ష్మిబాయి దేశీయ శూరురలైంది, మరియు ఆమెను మహిళా శూరురాలిగా ఒక గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 


ఆమెకున్న ధైర్యము, పరాక్రమము, మరియు వివేకము, భారతదేశంలో 19 వ శతాబ్దములో మహిళలకున్న అధికారం పై ఆమెకున్న ముందుచూపు, మరియు ఆమె చేసిన త్యాగాలు ఆమెని స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రసిద్ధ వ్యక్తిగా నిలిపింది. ఝాన్సీ మరియు గ్వాలియర్ లలో ఆమె గుర్తుగా కంచు విగ్రహాలను స్థాపించారు,రెండింటిలోను ఆమె గుర్రం పైన కూర్చున్నట్టుగా చిత్రీకరించారు.

జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ ని ముట్టడించడం ప్రారంభించింది.  రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. రాణి 1858, జూన్ 17 వ తేదీన గ్వాలియర్ యుద్ధం లో మరణించింది. ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి. ఇప్పటి బ్రిటీష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తోంది. టి.ఎ మార్టిన్ రాసిన లేఖ ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: