భారత దేశంలో స్వాతంత్రం కోసం పోరాడిన యోధుల్లో ఎంతో మంది చరిత్ర పుటల్లో నిలిచి పోయారు.   ఉక్కు మనిషి అంటే హాలీవుడ్ సూపర్ హిట్ 'ఐరన్ మాన్' కి తెలుగు డబ్బింగ్ వెర్షన్ వస్తుందేమో, అదే అయితే మాకు తెలియదు అనుకుంటే మీరు పొరబడినట్టే. మరి ఇంకెవరు అంటే, ఆయన గురించి చెప్పాలంటే మీకు స్వతంత్రం వచ్చినప్పడు మన దేశం ఎలా ఉందొ తెలియాలి ముందుగా. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం 500లకు పైగా చిన్న సంస్థానాల సమూహంగా ఉండేదట. ప్రతి ఒక్క సంస్థానం సొంత దేశం ల ఏర్పడ వచ్చు అని బ్రిటిష్ వాళ్ళు చిచ్చుపెట్టి వెళ్లారట.                    


మనకు అంతగా తెలియని, నాయకులు అంతగా స్మరించని, పార్టీలు పెద్దగా పట్టించుకోని ఇప్పుడున్న భారతదేశాన్ని సృష్టించిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే ‘ది ఐరన్ మాన్ అఫ్ ఇండియా’ సర్దార్ వల్లభాయ్ జావేర్భాయ్ పటేల్. స్వాతంత్రం తరువాత అస్తవ్యస్తంగా ఉన్న భారతాన్ని ఒక దారిలో పెట్టిన గొప్ప దార్శనికుడు. 500లకు పైగా ఉన్నసంస్థానాలన్నిటిని ఒక్క తాటిపైకి తెచ్చిన అపర చాణక్యుడు.                    


భారత తొలి ఉప ప్రధాని గా ఉన్న పటేల్, హైదరాబాద్, జమ్మూ తప్ప దాదాపు అన్ని సంస్థానాలని ఒక్క సమావేశం తోనే దేశంలో కలపటానికి ఒప్పించారట. పాకిస్తాన్ జమ్మూని ఆక్రమించుకోవాలని యుద్ధం ప్రకటించినప్పుడు, అప్పటి జమ్మూ రాజు, పటేల్ ని సాయం అడిగారట. భారత్ లో జమ్మూని విలీనం చేయాలి అనే ఒప్పందం కుదురుచుకొని, జమ్మూ కి సాయంగా పాకిస్తాన్ పై యుద్ధం కొనసాగించారట. ఇక రజాకారులతో అట్టుడుకుతున్న హైదరాబాద్ ని సాయుద పోరాటం తొ కలిపారు. ఇంత చేసిన ఉక్కు మనిషి గురించి మనం అందరం కొంతైన తెలుసుకోవటం ఎంతైనా అవసరం. ఈ మహానుభావుడి గురంచి మీరు కూడా అందరికి షేర్ చేయటం మరిచిపోకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: