డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇక లేరు. 50 ఏళ్లు డీఎంకే పార్టీ అధినేతగా కొనసాగిన కరుణానిధి.  గత కొంత కాలంగా అస్వస్థతతో ఉన్న విషయం తెలసిందే. కాగా ఈ రోజు సాయంత్రం 6.10 నిమిషాలకు కావేరీ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  ఆయన మరణ వార్త విన్న  అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు  చేరుకుంటున్నారు.
Image result for కరుణానిధి
కరుణానిధి ఫొటోలను పట్టుకొని ఆయన కోసం కంటతడి పెడుతున్నారు. ఇప్పటి వరకు  ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు చెబుతుండటంతో కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.  ఇక ఆయన మరణ వార్త వినగానే ఒక్కసారో శోక సంద్రంలో మునిగిపోయారు. మరోవైపు  ఆసుపత్రికి భారీగా కార్యకర్తలు తరలి వస్తుండటంతో భద్రతను పెంచారు. దాదాపు 600 మంది పోలీసులు ఆసుపత్రి వద్ద 24 గంటల పాటు విధులు నిర్వర్తిస్తున్నారు.
Image result for కరుణానిధి
 కాగా, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి మంగళవారం కావేరి ఆసుపత్రికి వచ్చి కరుణానిధిని చూశారు. కరుణ తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌, కూతురు కనిమొళితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు   తమ ప్రియతమ నాయకుడి పరిస్థితి గోప్యంగా ఉంచుతున్నారని కొంత మంది అభిమానులు ఆవేశ పడుతున్నారు.  దాంతో  కావేరి ఆసుపత్రి వద్ద ఉద్విగ్న, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కావేరి ఆసుపత్రితో పాటు రాజారత్నం స్టేడియంలో పోలీసులను భారీగా మొహరించారు.
Image result for కరుణానిధి
ఆస్పత్రి ప్రాంగణంలో డీఎంకే కార్యకర్తలు, అభిమానుల రోదనలు మిన్నంటాయి.  మరోవైపు తమిళనాడు డీజీపీ రాష్ట్రం అంతటా హైఅలర్ట్‌ ప్రకటించారు. జిల్లాల్లో ఉన్న పోలీసు అధికారులు అంతా చెన్నైకి రావాలని, సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.  ఢిల్లీలో ఉన్న తమ ఎంపీలు, నాయకులు చెన్నైకి రావాల్సిందిగా డీఎంకే పార్టీ కార్యాలయం ఆదేశించింది.    సాయంత్రం కావేరి ఆసుపత్రి డాక్టర్లు విడుదల చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: