ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందునుండి చిత్తశుద్ధితో విభజన హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్ఆర్ సీపీ పార్టీ. పార్లమెంటు సాక్షిగా విభజన నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రతి హక్కు అమలుచేయాలంటూ గత కొన్నాళ్ల నుండి కేంద్ర రాష్ట్ర అధికార పార్టీలను కడిగిపారేసిన ఏకైక నాయకుడు వైయస్ జగన్. ప్రతిపక్షంలో ఉన్నా గాని ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవకుండా కేంద్రంతో అలాగే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ తెలుగుదేశం పార్టీతో నిరంతరం పోరాడుతూనే ఉన్నారు.

Image result for jagan

ఈ క్రమంలో గతంలో ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ లాభమని తప్పుదోవపట్టించే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టిన సందర్భంలో జగన్ వెంటనే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ అప్రమత్తం చేసి అనేక సభలు సమావేశాలు నిర్వహించి ప్రత్యేకహోదా హక్కుపై  చైతన్యం కలిగించారు. మొత్తానికి ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ అయ్యేలా వ్యవహరించారు జగన్. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చేసిన కేంద్రంపై గతంలోనే అనేకసార్లు పార్లమెంటు సాక్షిగా పోరాటాలు కూడా చేశారు.

Image result for jagan

ఇలా ఉండగా తాజాగా మరోసారి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి దిమ్మ తిరిగిపోయే షాకిచ్చారు వైయస్సార్సీపి పార్టీకి చెందిన నాయకులు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల అంశంపై వైసీపీ తన వైఖరి స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీయేకు మద్దతివ్వబోమని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం వెల్లడించారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు.

Related image

దీంతో అధికార తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారం అవాస్తవమని తేలిపోయింది. వాస్తవానికి మొదటినుంచి ఎన్డీయేకు వైసీపీ పోరాడుతున్నా.. ప్రత్యేకహోదాపై పోరాటం చేస్తున్నా టీడీపీ మాత్రం జగన్ మోడితో చేతులు కలిపారని ప్రచారం చేస్తోంది. బీజేపీపై ఉన్న వ్యతిరేకతను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలని ఓ కుయుక్తితో వైసీపీకి వోటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని ప్రచారం చేస్తోంది. ప్రస్తుత ఘటనతో వైసీపీ ఎన్డీయేకు వ్యతిరేకమని తేలిపోయింది.  మొత్తంమీద చూసుకుంటే రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక పార్టీగా వైసీపీ పార్టీ అని మరొకసారి రుజువయ్యింది. తాజాగా వైసీపీ కేంద్రం పట్ల కరాఖండిగా వ్యవహరించడంతో...జగన్ పై బురద జల్లుధం అని అనుకున్నా టిడిపి నాయకుల నోరు మూసుకుపోయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: