విశాఖకు రైల్వే జోన్ వస్తొందో రాదో తెలియదు కానీ, రాజకీయం మాత్రం యమ రంజుగా సాగుతోంది. అదిగో జోన్, ఇదిగో జోన్ అంటూ బీజేపీ ఈ మధ్య బాగానే ఊరిస్తోంది. ఇచ్చేది, తెచ్చేది మేమే అంటూ బడాయి పోజులూ కొడుతోంది. రాజ్యసభలో మా హోం మంత్రి జోన్ ఇచ్చేస్తామంటూ చెప్పారని విశాఖలో సంబరాలు చేసుకున్న బీజేపీ నాయకులు ఆ డ్రామాను మరింతగా పండించేందుకు డిల్లీ టూర్ అంటూ వెళ్ళారు. అక్కడ జోన్ ఇస్తామన్నందుకు థాంక్స్ చెప్పేసి వట్టి చేతులతో తిరిగి వచ్చేసారు.


ఇపుడు వీరిదీ వంతు :


ఇక ఎక్కడ బీజేపీ జోన్ విషయంలో పొలిటికల్ మైలేజ్ కొట్టేస్తుందేమోనని తెగ కంగారు పడిన టీడీపీ నాయకులు మేము సైతం అంటూ డిల్లీ బాట పట్టారు. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిల్లీకి వెళ్ళిన తమ్ముళ్ళు అక్కడ చిన్న సైజ్ సీన్ క్రియేట్ చేసారు. ఏకంగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చాంబర్ వద్ద కాసేపు నిరసన పేరుతో  హడావుడి చేసి విశాఖకు ఏదో చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేశారు. అక్కడితే రాజకీయం అంతా తమకు అనుకూలమేనంటూ జబ్బలు చరచుకుంటున్నారు పసుపు పార్టీ నేతలు.


క్లారిటీ లేదుగా :


ఇప్పటికైతే  రైల్వే జోన్ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం విశేషం. జోన్ ఇచ్చే ఆలోచన వుందని అంటున్నారు కానీ ఎపుడు ఇస్తారు, ఎలా అన్నదానిపైన  నాలుగున్నరేళ్ళుగా ఎటువంటి  క్లారిటీ లేదు. పాత పాటనే పాడుతూ వస్తున్నారు అదే విషయం మొన్న రాజ్యసభలోనూ హోం మంత్రి చెప్పారు. మరి అందులో బీజేపీ నాయకులకు కొత్తగా ఏ హామీ వినిపించిందో తెలియదు కానీ జోన్ వచ్చేసినట్లే అంటున్నారు.

ఈ పోటీలో టీడీపీ రెడీగా ఉంది. అంటే ఈ రెండు పార్టీలు జోన్ పేరుతో డ్రామాలే ఆడుతున్నాయన్నది స్పష్టం. ఈ రాకీయ నాటకాలను  జనం ఎలా రిసీవ్ చెసుకుంటున్నారన్నదే ఇక్కడ పాయింట్.


మరింత సమాచారం తెలుసుకోండి: