పార్ట్ టైం రాజ‌కీయాల నుంచి ఫుల్ టైం రాజ‌కీయాల్లోకి వచ్చిన కొద్దిరోజుల్లోని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు ఓ విష‌యంపై మాత్రం క్లారిటీ వ‌చ్చింది. అదే మిటంటే.. సొంత మీడియా ఎంతో అత్య‌వ‌స‌ర‌మ‌ని. మీడియా ప‌రంగా చూస్తే.. హీరోగా అంద‌రివాడిగా ఉన్న‌ప‌వ‌న్‌.. పాలిటిషియ‌న్‌గా మాత్రం ఎవ్వ‌రికీ చెంద‌నివాడిగా మిగిలిపోయాడు. మ‌న‌ల్ని పొగుడుతూ ఎదుటివాడిని ఆడిపోసుకునే సొంత మీడియా లేక‌పోతే రాజ‌కీయ‌రంగంలో ఎంతోకాలం ఉండ‌లేమ‌న్న విష‌యాన్ని ఆయ‌న తొంద‌ర‌లోనే గ్ర‌హించారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికిప్పుడు సొంతంగా ఏర్పాటు చేసుకోవ‌డం క‌ష్టం కాబ‌ట్టి ఇప్ప‌టికే ఎస్టాబ్లిష్ అయి.. నిర్వ‌హించ‌లేని స్థితిలో ఉన్న ఎల‌క్ట్రానిక్‌, ప్రింట్ మీడియాను తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. 


ఇందులో భాగంగానే.. 99టీవీ కొనుగోలు. తాజాగా.. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, ఆంధ్ర‌ప్ర‌భ ప‌త్రిక న‌డిపిస్తున్న ముత్తా గోపాల‌కృష్ణ‌ను జ‌న‌సేన‌లోకి ఆహ్వానించారు ప‌వ‌న్‌. తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ‌రంగం...ప‌త్రికారంగం పెన‌వేసుకుని ఉంటున్నాయి.. ఒకానొక ద‌శ‌లో పాల‌కులే ప‌త్రికాయ‌జ‌మానులు ఉన్నారు.. ఉంటున్నారు.. మ‌రికొంద‌రు నేత‌లు య‌జ‌మానులుగా లేకున్నా.. వారిక‌నుస‌న్న‌ల్లో న‌డిచే ప‌త్రిక‌ల‌ను సృష్టించుకున్నారు. మొత్తంగా చెప్పాలంటే.. పార్టీల‌కు ప‌త్రిక‌లు ఉన్నాయి. ఇక వాటి విధి నిర్వ‌హ‌ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సొంత పార్టీని పొగుడుతూ.. ఎదుటిపార్టీల‌ను క‌డిగిపారేయడమే. తెలుగు రాష్ట్రాల్లో ప‌లు కాంబినేష‌న్లు హిట్టు కొట్టాయి. 


ముఖ్యంగా టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, దివంత‌గ‌ ఎన్టీఆర్‌- ఈనాడు ప‌త్రిక అధినేత రామోజీరావుల కాంబినేష‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. వారు తిరుగులేని శ‌క్తులుగా ఎదిగారు. ఒకానొక ద‌శ‌లో ఎన్టీఆర్‌ను గెలిచిపించాల‌ని ఈనాడు ప‌త్రిక‌లో సంపాద‌కియం వ‌చ్చిందంటే అర్థం చేసుకోవచ్చు వారి బంధం ఎంత‌లా పెన‌వేసుకుందో. ఇప్పుడు ముత్తా గోపాల‌కృష్ణ‌తో రాజ‌కీయంగా అంత‌లా అవ‌స‌రం లేకున్నా.. ఆంధ్ర‌ప‌త్రిక‌ను త‌న క‌నుస‌న్న‌ల్లో న‌డిపించాల‌ని ప‌వ‌న్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జ‌న‌సేన‌కు అనుకూలంగా ప‌త్రిక‌ను న‌డిపించాల‌న్న‌ది ప‌వ‌న్ ఆంత‌ర్యంగా క‌నిపిస్తోంది. 


అంతేగాకుండా.. ముత్తా గోపాల‌కృష్ణ ఆంగ్ల ఛాన‌ల్ కూడా ప్రారంభించారు. ఇది కూడా బ‌ల‌మైన కార‌ణంగానే క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ గోపాల‌కృష్ణ‌కు అంత‌లా ప్రాధాన్యం ఇస్తున్నారు. కాక‌పోతే.. ఇక్క‌డ డౌటేమిటంటే.. కాలం చెల్లిన ప‌త్రిక‌తో ప‌వ‌న్‌కు క‌లిసొస్తుందా..?  రాజ‌కీయాల‌కు ఎప్పుడో దూర‌మైన‌.. దాదాపుగా ప్ర‌జ‌లు మ‌రిచిపోయిన గోపాల‌కృష్ణ‌తో ప‌వ‌న్‌కు వ‌ర్కౌట్ అవుతుందా.. అని. అయినా.. కాల‌ము కాని కాల‌ములో విత్త‌న‌ము విత్తినా ఫ‌ల‌మున్నె.. అంటాడు ఓ క‌వి. చూద్దాం మ‌రి ఏం జ‌రుగుతుందో..



మరింత సమాచారం తెలుసుకోండి: