తూర్పు గోదావ‌రి జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం అమ‌లాపురంలో రోజు రోజుకు టీడీపీ గ్రాఫ్ డౌన్ అవుతుందా ? అంటే అక్క‌డ రాజ‌కీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అవున‌నే ఆన్స‌ర్ వినిపిస్తోంది. ఎస్సీ వ‌ర్గాల‌కు రిజ‌ర్వ్ చేసిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి అయితాబ‌త్తుల ఆనంద‌రావు విజ‌యం సాధించారు. అంత‌కు ముందు రెండు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ వ‌రుస‌గా టీడీపీ ఓడిపోతూ వ‌స్తోంది. అయితే, ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి ఇదే పార్టీ గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కాలు మాత్రం క‌నిపించ‌డం లేదు. రాష్ట్రంలోని దాదాపు 70 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుంద‌నే లెక్క‌లు వెలువ‌డుతున్నా.. ఒక్క అమ‌లాపురంలో మాత్రం ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

Image result for అయితాబ‌త్తుల ఆనంద‌రావు

దీనికి పార్టీలో ప‌రిస్థితులు, ఎమ్మెల్యే వ్య‌వ‌హార శైలి ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. అమలాపురం మున్సిపాలిటీ, అల్లవరం, అమలాపురం రూర ల్‌, ఉప్పలగుప్తం మండలాలతో కలిసి ఈ నియోజకవర్గం ఆ విర్భవించింది. ఈ నియోజకవర్గంలో రెండు ప్రధాన సామాజిక వర్గీయుల ఓట్ల తీర్పు ఆధారంగానే అభ్యర్థి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అమలాపురం రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార టీడీపీ, వైసీపీలతోపాటు వివిధపక్షాల తరపున పోటీచేసేందుకు ఆశావహులైన అభ్యర్థులు తమదైన శైలిలో ఉవ్విళ్లూరుతున్నారు. 


అధికార టీడీపీలో మూడు రాజకీయ కేంద్రాలు పనిచేస్తున్నా యి. ఒక కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వర్గీయులు సారథ్యం వహిస్తుంటే, మరో కేంద్రం దివంగత నేత మెట్ల సత్యనారాయణరావు వర్గం ఏలుబడిలో ఉంది. ఈ రెండు వర్గాలను సమన్వయం చేసుకుంటూ మూడో వర్గంగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చెలామణీ అవుతున్నారు. టీడీపీలో ఒకట్రెండు ప్రధాన సామాజిక వర్గాలు మినహా మిగిలిన సామాజికవర్గ నేతలు కొంచెం దూరంగానే ఉండడం పార్టీ ప్రముఖులకు ఇబ్బందికరంగా మారడంతోపాటు కేడర్‌పట్ల సానుకూలత కూడా కరువైందనే అభియోగాలు వినిపిస్తున్నాయి. 


ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేరుతోపాటు మరో ఇద్దరు ఆశావహుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అమలాపురం పురపాలక సంఘం అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతృప్తి ఉంది. ఎవరి సొంత నిర్ణయాలతో వారే పాలనలు సాగిస్తుండడంతో నియోజకవర్గ కేడర్‌లో సమన్వయలోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి బాల‌యోగి త‌న‌యుడు హ‌రీశ్ కూడా పోటీ చేస్తార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌రో ప‌దిమాసాల్లోనే జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో టీడీపీకి గెలుపు అంత సులువు కాద‌ని... నియోజక‌వ‌ర్గంలో పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు డౌన్ అవుతోంది. మ‌రి ఏం జ‌రుగుతోందో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: