Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Aug 19, 2018 | Last Updated 10:28 pm IST

Menu &Sections

Search

ఎడిటోరియ‌ల్ : రాజ‌ధాని ప్రాంతంలోనే ఇన్ని వివాదాలా ? కార‌ణాల‌వేనా ?

ఎడిటోరియ‌ల్ : రాజ‌ధాని ప్రాంతంలోనే ఇన్ని వివాదాలా ? కార‌ణాల‌వేనా ?
ఎడిటోరియ‌ల్ : రాజ‌ధాని ప్రాంతంలోనే ఇన్ని వివాదాలా ? కార‌ణాల‌వేనా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చంద్ర‌బాబునాయుడు ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల మనోభావాలు ప‌ట్ట‌వా ?  క్షేత్ర‌స్ధాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే అంద‌రిలోనూ అవే అనుమానాలు మొద‌ల‌య్యాయి.   ముఖ్య‌మంత్రి అయిన ద‌గ్గ‌ర నుండి విజ‌య‌వాడ‌ను ఇన్ని వివాదాలు చుట్టు ముడుతున్నా చంద్ర‌బాబులో క‌నీసమాత్రంగా కూడా స్పంద‌న క‌న‌బ‌డ‌టం లేదు. వివాదాల్లో టిడిపి నేత‌లు లేక‌పోతే సామాజిక‌వ‌ర్గం ఇన్వాల్వ్ మెంటు ఉండ‌ట‌మే చర్య‌లు తీసుకోలేక‌పోవ‌టానికి  ప్ర‌ధాన కార‌ణ‌మా ?


వివాదాలు ఈ స్ధాయిలో లేవు

tdp-chandrababu-crime-rate-tdp-leaders-community-b

గ‌తంలో కూడా విజ‌య‌వాడ చుట్టూ ఏదో ఒక వివాదం ఉండేదే అన‌టంలో  సందేహం లేదు. కానీ గ‌డ‌చిన నాలుగేళ్ళ‌ల్లో  ముసురుకున్న ఈ స్ధాయి వివాదాలు గ‌తంలో లేవ‌నే చెప్పాలి. విజ‌య‌వాడ చుట్టూ గ‌తంలో వివాదాలు ముసురుకోవ‌టం వేరు ఇపుడు వేర‌న్న విష‌యాన్ని పాల‌కులు గుర్తించిన‌ట్లు లేదు. గ‌తంలో వివాదాలు చుట్టుముట్టినా అపుడు అనేక న‌గ‌రాల్లో విజ‌య‌వాడ ఒక‌టి మాత్ర‌మే. కానీ ఇపుడలా కాదు. ఏకంగా రాజ‌ధాని ప్రాంతంగా మారిపోయింది.  స్వ‌యంగా ముఖ్య‌మంత్రి నివాస‌ముంటున్న ప్రాంతంలోనే ఇన్ని వివాదాలు రేగుతుండ‌ట‌మే ఆశ్చ‌ర్యంగా ఉంది. 


పెరిగిపోయిన క్రైం రేటు

tdp-chandrababu-crime-rate-tdp-leaders-community-b

చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాతే విజ‌య‌వాడ  రాజ‌ధాని ప్రాంత‌మైంది.  అప్ప‌టి నుండి క్రైం రేటు ఎక్కువైపోయింది.  కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గ‌తంలో ఎన్న‌డూ లేనంత క్రైం ఒక్క‌సారిగా పెరిగిపోయింది. మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు, డ‌బ్బుల కోసం కిడ్నాపులు, హ‌త్యలు, జూద‌గృహాల నిర్వ‌హ‌ణ...ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. మిగిలిన క్రైం రేటు ఎలాగున్నా కాల్ మ‌నీ సెక్స్ రాకెట్,  ప్రైవేటు స్ధలాల‌ను పోర్జ‌రీలు చేసి సొంతం చేసుకోవ‌టం  లాంటి భారీ నేరాల‌తో విజ‌య‌వాడ రాష్ట్రంలోనే సంచ‌ల‌నం సృష్టిస్తోంది. సంచ‌ల‌నం సృష్టించిన కాల్ మ‌నీ సెక్స్ రాకెట్

tdp-chandrababu-crime-rate-tdp-leaders-community-b

గ‌డ‌చిన నాలుగేళ్ళుగా  విజ‌య‌వాడ కేంద్రంగా ఇంత విచ్చ‌ల‌విడిగా నేరాలు పెరిగిపోవ‌టానికి కార‌ణాలేంటి ? అంటే చంద్ర‌బాబు చేత‌కాని త‌న‌మే అని చెప్ప‌క త‌ప్ప‌దు . ఎలాగంటే  వెలుగు చూస్తున్న నేరాల్లో అత్య‌ధిక నేరాల వెనుక టిడిపి నేత‌ల హ‌స్త‌ముంద‌నే  ఆరోప‌ణ‌లున్నాయి. కాల్ మ‌నీ సెక్స్ రాకెట్లో ఎంఎల్ఏలు, ఎంఎల్సీల సోద‌రులు, మంత్రుల మ‌ద్ద‌తుంద‌ని ప్ర‌తిపక్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు అంద‌రికీ తెలిసిందే. దానికి త‌గ్గ‌ట్లే సంచ‌ల‌నం  సృష్టించిన కాల్ మ‌నీ కేసులో ఎవ్వ‌రిపైనా ఇంత వ‌ర‌కూ పెద్ద‌గా చ‌ర్య‌లు లేవు. ఇక స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌కు ప్ర‌భుత్వం ఇచ్చిన అనేక స్ధలాల‌ను ఎంఎల్ఏ బోండా ఉమా త‌దిత‌రులు సొంతం చేసుకుంటున్న ఉదాహ‌ర‌ణ‌లు చాలానే ఉన్నాయి. 


టిడిపి నేతల పైనే ఆరోప‌ణ‌లు

tdp-chandrababu-crime-rate-tdp-leaders-community-b

అదే విధంగా డ‌బ్బుల కోసం జ‌రుగుతున్న కిడ్నపుల వెనుక కూడా టిడిపి నేత‌ల హ‌స్త‌మే ఉంద‌నే ఆరోప‌ణ‌లు విన‌బ‌డుతున్నాయి. ఇక‌, తాజాగా దుర్గ‌గుడిలో అమ్మ‌వారికి  భ‌క్తులిచ్చిన ప‌ట్టుచీర‌ను ఏకంగా ధ‌ర్మ‌క‌ర్త‌ల మండలి స‌భ్యురాలు కోడెల సూర్య‌ల‌త దొంగ‌త‌నం చేయ‌టం ఆశ్చ‌ర్యంగా ఉంది. దొంగ‌త‌నాలు చేస్తున్న‌వారిని, నేరాల వెనుక ఉన్న‌వారిపై ప్ర‌భుత్వం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌టం లేదంటే రెండే కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి టిడిపి నేత‌ల‌వ్వ‌ట‌మో లేక‌పోతే మ‌ద్ద‌తుండ‌ట‌మో. ఇక‌, రెండోది త‌మ సామాజిక‌వ‌ర్గం వార‌వ్వ‌ట‌మే. అందుక‌నే ప్ర‌భుత్వంలో విచ్చ‌ల‌విడిత‌నం పెరిగిపోవ‌టంతోనే విజ‌య‌వాడ ప్రాంతం ఇన్ని వివాదాల‌కు కేంద్ర‌బింధువై పోయింది.  


tdp-chandrababu-crime-rate-tdp-leaders-community-b
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముస్లిం ఓట్ల‌కు చంద్ర‌బాబు కొత్త వ‌ల
జెడికి సీన్ అర్ధ‌మైన‌ట్లుంది...భ‌విష్య‌త్ ప్లాన్ ఎంటి ?
టిడిపి వార‌సుల్లో ఇద్ద‌రికి మాత్ర‌మే గ్రీన్ సిగ్న‌ల్
ఎడిటోరియ‌ల్ : అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌లో చంద్ర‌బాబు కొత్త ట్రెండ్ ...అదేంటో తెలుసా ?
తూర్పులో వైసిపికి షాక్
ఎడిటోరియ‌ల్ : ప‌వ‌న్ ఒక అప‌రిచుతుడేనా
ప‌వ‌న్ పై మండిపోతున్న బిసి నేత‌లు
జ‌గ‌న్ పాద‌యాత్ర లోనే వైసిపికి షాక్
ఎడిటోరియ‌ల్ : నిజ‌మైన భార‌తర‌త్న అంటే వాజ్ పేయినే
ప్ర‌భుత్వ అవినీతిని క‌డిగిపారేసిన అజేయ క‌ల్లం
రాజ‌మౌళి స‌ల‌హాలైపోయాయి...ఇపుడు సురేష్ వంతొచ్చింది
ఎడిటోరియ‌ల్ : వైసిపిలోకి త్వ‌ర‌లో టిడిపి బిగ్ వికెట్...కొడుకు భ‌విష్య‌త్ కోస‌మేనా ?
ఎడిటోరియ‌ల్ : జ‌న‌సేన‌లో కాపుల‌కే ప్రాధాన్య‌మా ? కోట‌రీ చేతిలో ఇరుక్కుపోయారా ?
ఇంటి మేడ మీదే జెండా వంద‌నమా ? జ‌గన్ విష‌యంలో జ‌రిగుంటేనా ?
అమ‌రావ‌తి విష‌యంలో చంద్ర‌బాబు చెప్పింది నిజ‌మేనా ?
పోల‌వ‌రానికి మ‌రో దెబ్బ‌..వెన‌కాడుతున్న కాంట్రాక్ట‌ర్లు-సిఎం ఫైర్
టిడిపి ఎంఎల్ఏకి రూ. 50 ల‌క్ష‌ల టోపి
ఎడిటోరియ‌ల్ : ఫిరాయింపు ఎంపికి టిక్కెట్టు అవుటేనా ?
వైసిపిలో మ‌రో పాద‌యాత్ర మొద‌లైంది
చంద్ర‌బాబు గురించి క‌న్నాకు తెలిసిందింతేనా ?
జ‌మిలి ఎన్నిక‌లు లేన‌ట్లే..మ‌రి ముంద‌స్తు ఎన్నిక‌లు ?
ఎడిటోరియ‌ల్ : అమ‌రావ‌తి బాండ్ల‌పై ప్ర‌భుత్వం కొత్త క‌థ‌.. అదేనా బ్రాండ్ ఇమేజి ?
చంద్ర‌బాబుకు హైకోర్టు షాక్
ఎడిటోరియ‌ల్ : చ‌ంద్ర‌బాబు మ‌రీ అంత‌లా భ‌య‌ప‌డుతున్నారా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.