భారతదేశం ముక్కలు కాకూడదని తుది వరకు తపన పడ్డాడు మహాత్మా గాంధీ. అందుకోసం ఆయన ఏమైనా చేయాలనుకున్నారు. ఒకానొక దశలో తన దేహాన్ని రెండు ముక్కలు చేసి అపుడు దేశాన్ని విడగొట్టండని తెల్ల దొరలకు సవాల్ చేసారు బాపూజీ. నిజానికి ఈ దేశానికి స్వాతంత్రం కాస్త ముందుగానే వచ్చేది కానీ అప్పటి అధికార రాజకీయాలే దాన్ని ఆలస్యం చేశాయి. బ్రిటిష్ వారు ఆడిన ఆటలో, వేసిన పాచికలో పావులైన నాటి తరం నాయకులు దేశాన్ని చివరకు ముక్కలే చేశారు.


ఆ మాట.. ఈ నోట :


తాము వదలి పోతున్నా భారత్ ఎప్పటికీ ప్రశాంతంగా ఉందరాదని బ్రిటిష్ పాలకులు కుటిల నీతిని ఉపయోగించారు. అందులో భాగమే అప్పటికే కాంగ్రెస్ ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుని ముస్లిం లీగ్ ని స్థాపించి వేరుగా ఉన్న జిన్నాను దువ్వడం, వెనకేసుకురావడం. నాటి పరిణామాలలో జిన్నా భారత్ లో ముస్లింలకు భద్రత లేదన్న నినాదాని అందుకున్నాడు. బ్రిటిష్ కుట్రను తన గొంతులో వినిపించాడు. దాంతో దేశంలో స్వాతంత్ర ఉద్యమం సరి కొత్త మార్గం వైపు మళ్ళింది.


అలా అనుకున్నది ఎవరు :


అప్పటికే బ్రిటిష్ వారు ఇంటా బయటా వత్తిళ్ళతో సతమతమవుతున్నారు. రెండవ ప్రపంచ యుధ్ధ పరిణామాలు కూడా వారిని తొందర పెడుతున్నాయి. దాంతో ఇక భారత్ నుంచి వెళ్ళిపోవాల్సిన అనివార్యత ఏర్పడింది. అటువంటి టైం లో కూడా ఈ దేశం మీద విషమే చిమ్మారు. ఒక చేత్తో ఇస్తూనే రెండవ చేత్తో  కత్తులు దూశారు. దానికి సరిగ్గా అర్ధం చేసుకున్నది మహాత్ముడు ఒక్కరే. ఈ దేశాన్ని ముక్కలు చేసేందుకు తెల్ల వాడు పధకం పన్నుతున్నాడని గ్రహించాడు బాపూజి. దానికి విరుగుడు మంత్రం కూడా కనిపెట్టాడు. ఆ టైంలో వచ్చిందే కొత్త ప్రతిపాదన. దేశం విడిపోతే ప్రధాని పదవి వస్తుందని ఆశపడుతున్న జిన్నానే భారత్ కు తొలి ప్రధానిగా చేయాలను ప్రతిపాదించారు


.అప్పటికే జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని అని అంతటా వినిపిస్తోంది. ఆ టైంలో గాంధీ ప్రతిపాదనకు తాను పెంచిన కాంగ్రెస్ ఉద్యమంలోనే మద్దతు కరవైంది. ఫలితంగా కొందరి అధికార కాంక్షకు భారత్ రెండుగా ముక్కలైంది.ఆ రావణ కాష్టం డెబ్బై ఏళ్ళు అయినా నేటికీ రగులుతూనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: