రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌కు వ్యతిరేకంగా భారత రక్షణను ప్రజాప్రభుత్వానికి అప్పజెప్పాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీనికిగాను గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని రూపొందించారు. 1942, జూలైలో వార్ధాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బ్రిటిష్‌వారిని భారతదేశం వదిలివెళ్లమని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీన్నే ఆంగ్లంలో క్విట్ ఇండియా అంటారు. 


దీన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 1942, ఆగస్టు 8న ఆమోదించడంతో జాతీయోద్యమం తుది దశ బొంబాయిలో ప్రారంభమైంది. ఐక్య రాజ్యాల విజయం కోసం, భారతదేశం కోసం భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే ముగియడం అత్యవసరం. కావున ప్రజాపోరాటమే ఏకైక మార్గమని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది.1942, ఆగస్టు 9న గాంధీని, ప్రముఖ నాయకులందరినీ ప్రభుత్వం నిర్బంధించడమే కాకుండా కాంగ్రెస్ సంస్థను నిషేధించింది. 


పోలీసులు ఉద్యమాన్ని అణచివేసేందుకు క్రూరమైన చర్యలకు దిగారు. నాయకత్వం లేక ప్రజలు తీవ్రంగా ఉద్యమించారు. హింసాత్మక విధ్వంసక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం దమన నీతితో ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని అణచివేసింది.  డూ ఆర్ డై (ఉద్యమించండి లేదా మరణించండి) అని ప్రజలకు గాంధీజీ పిలుపునిచ్చారు. జాతీయ నాయకులందరూ అరెస్టయినప్పు డు అరుణా అసఫ్ అలీ, జయప్రకాష్ నారాయణ్ లాంటి రెండో తరం నాయకులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఉషామెహతా కాంగ్రెస్ రేడియోను నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: