మహమ్మద్ అలీ జిన్నాను భారత్ కి ప్రధానిని చేసి ఉంటే ఈ దేశం ఎప్పటికీ ముక్కలు అయ్యేది కాదంటూ బౌధ్ధ గురువు దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఈ రోజు జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన  దలైలామా  ఓ విధ్యార్ధి అడిగిన ప్రశ్నతో ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటూ ఆ విధ్యార్ధి దలైలామాను అడిగినపుడు దలైలామా స్పందిస్తూ జవహర్ లాల్ నెహ్రూ అంతటి వాడే తప్పు చేశాడని  దేశ విభజనపై హాట్ కామెంట్స్ చేశారు. గొప్పవారైనంత మాత్రాన తప్పులకు ఎవరూ అతీతులు కారని అన్నారు.


నెహ్రూ ఒప్పుకోలేదట :


దేశం ముక్కలు కారాదని భావించిన మహాత్మా గాంధీ తొలి ప్రధానిగా జిన్నాను ప్రతిపాదించారని, అందుకు నెహ్రూ ఒప్పుకోలేదని దలైలామా చెప్పడం విశేషం. తాను ప్రధాని కావాలని నెహ్రూ పట్టుపట్టడంతో ఆ ప్రతిపాదన వీగిపోయిందని నాటి ఉదంతాన్ని చెప్పుకొచ్చారు. ఒకవేళ నెహ్రూ కనుక ఆ తప్పు చేయకుండా గాంధీ ప్రతిపాదనను అంగీకరించి ఉంటే జిన్నా తొలి ప్రధాని అయ్యేవారని దలైలామా  అన్నారు. అపుడు భారత్ రెండుగా విడిపోయే ప్రసక్తే ఉండేది కాదని కూడా అన్నారు.

మొత్తానికి ఈ దేశం రెండుగా విడిపోవడానికి అధికార దాహమే ప్రధాన కారణమన్నది దలైలామా  తాజా వ్యాఖ్యల బట్టి అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: