తెల్లారిలేస్తే డిల్లీ పాలకులు చుట్టూ తిరిగే వెన్నముక లేని సీఎం లను చూస్తున్న ఈ టైంలో కూడా ఏనాడు హస్తిన గడప తొక్కని రాజకీయ గండర గండడు తమిళనాడు జన నేత కరుణానిధి. ఆయన తానున్న చోట నుంచే చక్రం తిప్పేవారు. తనకు అనుకూలంగా డిల్లీ రాజకీయాన్నే మార్చుకునేవారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా కరుణానిధి ఇంటి గడప తొక్కాల్సిందే. ఆలా తన తన నిండైన ఆత్మ గౌరవాన్ని తుది వరకూ చాటుకున్న మహా నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు.


జాతీయనాయకులే క్యూ కట్టారు :


దేశంలో రాజకీయాలు ఏ మలుపు తీసుకున్నా, ఏ ఉపద్రవం సంభవించినా జాతీయ నాయకులంతా తమిళనాడు వైపే చూసే వారు. ఆయన కరుణ కొసం పరితపించేవారు. ఇక సంకీర్ణ రాజకీయ యుగంలో కరుణ మద్దతు కోసం తిరగని పార్టీ అంటూ లేదు. ఎంతటి వారైనా తన వద్దకు రావాల్సిందే. రాయబారాలన్ని తన చెంతకు చేరాల్సిందే. 


నిలువెత్తు సంతకం :



ఆయన తమిళ జాతి నిలువెత్తు సంతకం. మా నాయకుడంటూ  గర్వంగా చెప్పుకునే స్థాయిలోనే ఆయన రాజకీయం ఎపుడూ సాగింది. ఆయన అరవయ్యేళ్ళ  చట్ట సభా పర్వమంతా అసెంబ్లీ చుట్టూనే పరిభ్రమించింది. ఆయన ఎందరినో పార్లమెంట్ గడప తొక్కించారు కానీ, తాను మాత్రం ఎపుడు ఆ వైపు తొంగి చూడలేదు. తన జీవితం తమిళులకే అంకితం అనుకోవడమే కాదు. ఆచరణలోనూ  చూపించిన మేరు నగధీరుడు. దటీజ్ కరుణానిధి. 



మరింత సమాచారం తెలుసుకోండి: